2022 ఏప్రిల్ 2 శనివారం ఉగాది
ఉగాదిపచ్చడి ఆరురుచుల సమ్మేళనం.సంవత్సర కాలపరిమితిలో ఆరు రుతువులకు సంకేతంగా,మానవజీవితంలో వచ్చే కష్ట నష్టాలకు, అనుభవాలకూ ప్రతీకగా ఉగాది పచ్చడి తీసుకుంటారు. చేదు,తీపి,ఉప్పు,పులుపు,కారం,వగరు ఈ ఆరు రుచులూ ఈ పచ్చడిలో ఉంటాయి. వేపపువ్వు, కొత్తబెల్లం, ఉప్పు, చింతపండు, మిరియాలు, లేతమామిడిముక్కలు కలిపి చేసిన ఈ ఉగాది పచ్చడి వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలున్నాయి.
య ద్వర్షాదౌ నింబ సుమం
శర్క రామ్ల ఘృతైర్యుతంః
భక్షితం పూర్వయామే స్యాత్
త ద్వర్షం సౌఖ్యదాయకంః
యోగశాస్త్రపరంగా ప్రతి మనిషిలో ఆరు చక్రాలు ఉంటాయి. అవి మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రాలు. ఈ ఆకు చక్రాలకు ప్రతీకగా ఉగాది పచ్చడిలో ఆరు రుచులకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఎందుకంటే మనం వివిధ రకాలైన ఆహారపదార్థాలు తీసుకున్నప్పుడు ఆయా రుచులకు అనుగుణంగా ఆయా చక్రాలు చైతన్యవంతం అవుతాయి. ప్రాణవాయువు మనలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే అయిదు రకాలుగా ఉంటుంది. ఇవన్నీ వివిధ రుచులతో అనుసంధానమై ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఏ రుచి ఎక్కువగా ఉందో అందుకు అనుగుణంగా ఆ రకమైన ప్రాణవాయువు ఉత్తేజితమవుతుంది. రుచులన్నీ సమపాళ్లలో అందినప్పుడే శరీరం మనిషి స్వాధీనంలో ఉంటుంది. ఉగాది పచ్చడిలో ఆరు రుచులను కలిపి మేళవించడంలో ఉన్న మరో అర్థం ఇదే.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
ఉగాది పచ్చడిలో వేసే ఒక్కో పదార్థం ఒక్కొక్క భావానికి ప్రతీక
- బెల్లం ఆనందానికి సంకేతం, కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది
- ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి ఉప్పు.. ఇది భయానికి జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం.
- ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో అతిముఖ్యమైదని చేదు. ఇది జీవితంలో కలిగే బాధలకు దుఃఖానికి సంకేతం. ఈరుచి కోసం వేప పువ్వుని ఉపయోగిస్తారు. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది.
- పులుపు..ఈ రుచి విసుగుకి సంకేతం.పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండుని ఉపయోగిస్తారు. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
- మామిడి ముక్కలు కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంచేస్తుంది
- కారం ఈ రుచి సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. కారం శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఆరు ఋతువుల్లో వచ్చే రుగ్మతలను దూరం చేసే దివ్యమైన ఔషధంగా ఈ పచ్చడిని స్వీకరిస్తారు. ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడి సేవించాలని పెద్దలు తెలిపారు.
శ్లో|| శతాయ వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ |
సర్వారిష్ట వినాశాయ నంబకం దళ బక్షణం ||
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.