Tirumala:  తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దాదాపు 670 కోట్లు వసూలు చేస్తే కేవలం జూలై నెలో 125 కోట్లు జమైంది...


కలియుగ ప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వరుడి హుండీ కళకళలాడిపోతోంది. నెల నెలకూ స్వామివారికి హుండీ ఆదాయం, వచ్చే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఏడు నెలల్లో మొదటి ఆరునెలలు కన్నా ఏడో నెలలో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. పెరుగుల భక్తుల సంఖ్యకు తగ్గుట్టుగానే హుండీ ఆదాయం అంతకంతకూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనవరి నుంచి స్వామివారి హుండీ ఆదాయం పరిశీలిస్తే.. 



  • జనవరిలో రూ.116.46 కోట్లు

  • ఫిబ్రవరిలో రూ. 111.71 కోట్లు

  • మార్చిలో రూ. 118.49 కోట్లు

  • ఏప్రిల్ లో రూ.101.63 కోట్లు

  • మే నెలలో రూ.108.28 కోట్లు

  • జూన్ నెలలో రూ.113.64 కోట్లు

  • జూలైలో రూ.125.35 కోట్లు


జనవరిలో 116 కోట్లు కాగా..ఫిబ్రవరిలో కొంత తగ్గింది..మళ్లీ మార్చిలో హుండీ ఆదాయం జనవరి కన్నా పెరిగింది. మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్, మే నెలల్లో వరుసగా తగ్గినా జూన్ లో పెరిగింది...జూలైలో అంతకుమించి నమోదు చేసింది. జూలైలో దాదాపు 22.13 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.  కోటి 4 లక్షల లడ్డూలు విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది. ఇక అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల విషయానికొస్తే 24.04 లక్షల మంది అని టీటీడీ అదికారులు వెల్లడించారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 లక్షలు.  
Also Read: తెలిసో తెలియకో పాముల్ని చంపేస్తే ఏం జరుగుతుంది - ఏం చేస్తే ఆ పాపం పోతుంది!


తిరుమల అన్నమయ్య భవన్ లో యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు..స్వామివారికి సేవచేసే భాగ్యం దక్కడం అదృష్టం అన్నారు. ఈ సందర్భంగా జూలై నెలలో వివారాలను వెల్లడించారు. ఇంకా భక్తుల సౌకర్యాల గురించి కూడా మాట్లాడారు. ఈ ఏడాది అక్టోబరు 4 నుంచి 12వ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల పనులను సెప్టెంబరు చివరినాటికి పూర్తి చేసేందుకు అధికారులను ఆదేశించాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.  తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్‌ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుండచి పుష్కరిణిని మూసివేశాం. నెల రోజుల పాటూ శ్రీవారి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా పైభాగంలో షవర్లు ఏర్పాటు చేశామని శ్యామలరావు చెప్పారు. 


Also Read: పాపం చేసిన వెంటనే దేవుడు శిక్ష వేసేయొచ్చు కదా..వచ్చే జన్మవరకూ ఎందుకు ఆగాలి!
 
భక్తుల సౌకర్యార్థం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు



  • ఆఫ్‌లైన్‌లో రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో జారీ.

  • తిరుమలలో ప్రతిరోజు వేలాదిమంది భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని మరింత పెంచేందుకు నాణ్యమైన బియ్యం, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు

  • తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడిసరుకులను ఎప్పటికప్పుడు పరిక్షించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆధ్వర్యంలో అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు 

  • క్యూలైన్లల్లో, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగు నీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను ఎప్పటికప్పుడు పరివేక్షించేలా ప్రత్యేకంగా కొందరు ఆధికారులకు బాధ్యతలు 

  • భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లలో ఆరు చోట్ల అన్నప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు  .

  • శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జితసేవ టికెట్లకు సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు

  • టీటీడి నిబంధనలు పాటించని హోటళ్ళపై చట్టపరమైన చర్యలు

  • శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి, నాణ్యత పెంపు

  • టీటీడీ ఐటి వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్‌లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు

  • గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్‌ఎస్‌డి టోకెన్లు భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నాం, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలన


Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!