మే 2 సోమవారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 02- 05 - 2022
వారం: సోమవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం
తిథి : విదియ సోమవారం రాత్రి 3.19 వరకు తదుపరి తదియ
వారం : సోమవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం: కృత్తిక రాత్రి 11.04 వరకు తదుపరి రోహిణి
వర్జ్యం : ఉదయం 10.06 నుంచి 11.49
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.22 నుంచి 1.13
అమృతఘడియలు : రాత్రి 8.28 నుంచి 10.11 వరకు తిరిగి 2.54 నుంచి 3.45 వరకు
సూర్యోదయం: 05:37
సూర్యాస్తమయం : 06:16
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: మే ౩న అక్షయ తృతీయ, ఆ రోజు ఇలా చేస్తే చాలా మంచిది
సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. బోళాశంకరుడిని తలుచుకుంటే చాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. సోమవారం రోజు శివస్త్రోత్రాలు ఏవి చదువుకున్నా మంచిదే. ఈ రోజు మీకోసం బిల్వాష్టకమ్ అందిస్తున్నాం.
బిల్వాష్టకమ్
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం
అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం
బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.
Also Read: ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు
Also Read: ఇది ఆచార్య ధర్మస్థలి కాదు రియల్ ధర్మస్థలి, ఎక్కడుందంటే!