మే 25 బుధవారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 25- 05 - 2022
వారం:  బుధవారం   


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం


తిథి  : దశమి బుధవారం మధ్యాహ్నం 1.40 వరకు తదుపరి ఏకాదశి
వారం : బుధవారం
నక్షత్రం:  ఉత్తరాభాద్ర రాత్రి 1.57 వరకు తదుపరి రేవతి
వర్జ్యం :  ఉదయం 11.38 నుంచి 1.13 వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 11.31 నుంచి 12.23  
అమృతఘడియలు  :  రాత్రి 9.10 నుంచి 10.45 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:24


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది


బుధవారం సాధారణంగా వినాయకుడు, అయ్యప్పస్వామి ప్రత్యేకం. అయితే ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకం. 


వైశాఖేమాసికృష్ణాయాం దశమ్యాం మందవాసరే 
పూర్వాభాద్రాప్రసూతాయ మంగళంశ్రీ హనూమతే 
అని మంగళాష్టకాలు చెపుతున్నాయి. అంటే ,వైశాఖమాసంలో బహుళపక్షంలో దశమి తిథి పూర్వాభాద్రా నక్షత్రంతో కలిసిన శనివారం రోజున హానుమంతుని జన్మించాడని చెబుతారు. అయితే తెలంగాణ సహా కొన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి అనంతరం హనుమాన్ జయంతి జరుపుతారు. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించాడని అందుకే ఈరోజున హనుమంతుడి జన్మతిథి చేసుకోవాలని చెబుతారు. మరికొన్ని ఇతిహాసాల ప్రకారం  చైత్ర పౌర్ణమి నాడు ఎందరో రాక్షసులను సంహరించి విజయం సాధించిన కారణంగా ఈ రోజు విజయోత్సవం జరుపుకుంటారని చెబుతారు. ఉత్తరాది ప్రాంతాలతో సహా తెలంగాణలోనూ హన్ మాన్ విజయోత్సవాన్నే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు.కానీ మరికొన్ని రాష్ట్రాల్లో వైశకమాసం బహుళపక్షం దశమి రోజు హనుమజ్జయంతి చేస్తారు. 


హనుమంతుని నైజం 
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.


శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం


మాణిక్యం
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || 


ముత్యం
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి ||


ప్రవాలం
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః || 


మరకతం
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || 


పుష్యరాగం
ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ || 


హీరకం
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || 


ఇంద్రనీలం
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || 


గోమేధికం
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః ||


వైడూర్యం
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ |
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ ||


Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా


Also Read: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!