Varaha Lakshmi Narasimha temple Simhachalam


భక్తుల్లో నిజంగా ఇంత మార్పొచ్చిందా? 


తిరుమల ఘటన భయపెట్టిందా?


వాతావరణం వణికించిందా?


కారణాలు ఏమైనా కానీ సింహాచల క్షేత్రంలో ఉత్తరద్వార దర్శనాల క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయ్. 


కళ తప్పిన విశాఖ సింహాచల క్షేత్ర ఉత్తర ద్వార దర్శనాలు, వెలవెలబోతున్న క్యూలైన్లు అని అంటున్నారు కానీ.. వాస్తవానికి భక్తులు ప్రశాంతంగా ఉత్తర ద్వార దర్శనాలు చేసుకున్నారని అనుకోవాలేమో. 


ఇది నిజంగా మంచి పరిణామమే. ఎందుకంటే తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటన చూసిన తర్వాత... పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్లి భారీ రద్దీలో తోసుకుంటూ, జరగండి జరగండి అనే అరుపుల మధ్య భగవంతుడిని ప్రశాంతంగా చూసే అవకాశం లేనప్పుడు ఇంటికి సమీపంలో ఉన్న ఆలయాల్లో దర్శించుకోవడం మంచిదని కూడా అనుకుని ఉండొచ్చు. 


Also Read: వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవాలా..ఇది నిజంగా భక్తేనా..?


మరోవైపు చలి విపరీతంగా పెరిగింది. తెల్లవారుజామునే దర్శనాలకు వెళితే చలి..ఆ తర్వాత వెళదాం అంటే రద్దీ..అందుకే భక్తులు ప్రశాంతంగా ఇంటికి సమీపంలో ఉండే ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనాలు చేసుకుని ఉండొచ్చు. సింహాచలంలో భక్తుల రద్దీ తగ్గేందుకు ఇదీ ఓ కారణం అయి ఉండొచ్చు..
 
గతంలో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనాలు అంటే భారీగా భక్తులు పోటెత్తేవారు. అందుకే దేవస్థానం అధికారులు కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు.  సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లను ముందుగానే పరిశీలించారు అధికారులు.  స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంయమనంతో ఉండాలని..అప్పుడే ప్రశాంతంగా దర్శనం జరుగుతుందని చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంతరాలయ దర్శనాలు, రాజగోపుర ప్రవేశ దర్శనాలను పూర్తిగా నిలిపేశామని  దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి చెప్పారు. భక్తులంతా టికెట్ తీసుకుని దర్శనాలకు రావాలని ఉచిత పాస్ లు జారీ చేయలేమని స్పష్టం చేశారు. 


Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


ముక్కోటి ఏకాదశి  శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవ ఆ తర్వాత ప్రభాత ఆరాధనలు నిర్వహించారు. 3 గంటలకు స్వామివారి సేవ, మేలి ముసుగులతో బేడా తిరువీధి నిర్వహించారు. 4.15 గంటలకు ఉత్తర ద్వారంలో ప్రత్యేక పూజలు చేసి ముందుగా అనువంశిక ధర్మకర్త, వారి కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించారు. 5  నుంచి 11.30  వరకు ఉత్తర రాజగోపురంలో ఉన్న పుష్పవేదిక పై  వైకుంఠవాసుడి అలంకారంలో స్వామి దర్శనం కల్పించారు. 12 గంటల నుంచి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటలకు మహా నివేదన చేశారు. మధ్యాహ్నంన 2 నుంచి 4 గంటలవరకూ మహానివేదన సందర్భంగా దర్శనాలకు భక్తులను అనుమతించలేదు. తిరిగి 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. రాత్రి 7 గంటలకు ఆరాధన సందర్భంగా భక్తులకు దర్శనాలు నిలిపేస్తారు. ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా వైకుంఠ ఏకాదశి రోజు ఆర్జితసేవలన్నీ రద్దు చేశారు. కేవలం అనువంశిక ధర్మకర్త, ఆయన కుటుంబ సభ్యులకు మినహా ఇంకెవరీకీ అంతరాలయ ప్రవేశం ఉండదు. శుక్రవారం తెల్లవారుజామున  3 గంటల నుంచి  500 రూపాయల ఉత్సవ ప్రత్యేక దర్శన టికెట్లు విక్రయించారు. ఇక భక్తుల కోసం లక్ష లడ్డూ సిద్ధం చేశారు. అన్న ప్రసాద వితరణ కొనసాగుతోంది. వైకుంఠ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర రాజగోపురంతో పాటూ ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు.


కారణాలు ఏమైనా కానీ భక్తుల రద్దీ తగ్గడం అంటే భక్తి తగ్గిందని కాదు.. భక్తుల్లో అవగాహన పెరుగుతోంది, ప్రాణాలను హరించే రద్దీలో కాకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేందుకే ఆసక్తి చూపిస్తున్నారని అనుకోవాలేమో. ఈ ప్రభావంతోనే గతంలో కిక్కిరిసి కనిపించే క్యూలైన్లు ఈ ఏడాది ఖాళీగా కనిపించాయ్.. 


Also Read: 600 కోట్ల ఖర్చు.. 7జన్మలకు గుర్తుగా 7ద్వారాలు.. మిల్లు కార్మికుడి కొడుకు కట్టిన అద్భుతమైన స్వర్ణ దేవాలయం!