ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం  ఉండేది బ్రహ్మస్థానం. అంటే శరీరంలో ఉన్న షట్చక్రాల్లో తలపై ఉండేది ఏడవది బ్రహ్మరంధ్రం. మూలాధార చక్రం నుంచి  స్వాధిష్ఠానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం ఇవన్నీ దాటితే తలపై ఉండే బ్రహ్మస్థానం అయిన సహస్రారం ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న ఆనందనిలయం అన్నమాట. మరి స్వామివారి ఆనందనిలయాన్ని చేరుకోవాలంటే..ఏడుకొండలు ఎక్కడం వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసా...


తిరుమల 7 కొండలు
1. వృషభాద్రి 2. వృషాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి. 


1. వృషభాద్రి - అంటే ఎద్దు.
వృషభం అంటే ఎద్దు...శివుడి వాహనం.  వ్రుశాభానికి ఋగ్వేదం లో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములు, 3 పాదాలు ఉంటాయి. (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణం, వేదం ప్రమాణాన్ని అంగీకరించిన వారు మొదటి కొండ ఎక్కుతారు. 


Also Read: అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన చక్రాలు విన్నారు కదా-అవేంటో తెలుసా


2. వృషాద్రి - అంటే ధర్మం
ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. భగవంతుడున్నాడని విశ్వశిచినప్పుడు...ఆ దేవుడు ఇచ్చిన జన్మని చెడుకి వినియోగించకుండా ఉండటం. అంటే..మంచి వినడం, చూడడం, మంచి మాట్లాడటం..అలా..దాని వల్ల ఇహం లోను, పరలోకం లోను సుఖాన్ని పొందుతాడు. అవి చేయడమే వృషాద్రి ఎక్కడం. 


3. గరుడాద్రి - అంటే పక్షి- జ్ఞనాన్ని పొందడం 
షడ్ చక్రాల విషయానికొస్తే.. షడ్ అంటే జీర్ణం కానిది అని అర్థం. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణం కానిది. పుట్టింది, ఉన్నది, పెరిగింది, మార్పు చెందింది, తరిగినది, నశించినది..ఇవననీ పుట్టిన ప్రతి ఒక్కరికీ జరుగుతూ ఉంటాయి. ఈ 6 లేని వాడు భగవానుడు.
 భ- ఐశ్వర్యం, బలం, తేజస్సు & అంతా తానే బ్రహ్మాండము అయినవాడు. 
అన్- ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు.
అలాంటి భగవంతుడిని జ్ఞానంతో తెలుసుకోవడమే గరుడాద్రి


4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక
కాటుక అందాన్నిస్తుంది..చలవ చేస్తుంది. కంటికి అందం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. చూడవలసినవి చూసినప్పుడు మాత్రమే ఈ కంటికి అందం. ఈ కంటితో చూసినదంతా బ్రహ్మమే అని తెలుసుకోవడం కాటుక. అంతా పరమాత్ముడి సృష్టే. అప్పుడు అంజనాద్రి దాటతాడు.


5. శేషాద్రి
ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసినవారికి రాగద్వేషాలుండవు. క్రోధం, శత్రుత్వం ఉండదని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే  తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వారికి ఉన్న భయం..అంతా బ్రహ్మమే అనుకునేవారికి ఉండదు.   ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితిలో శేషాద్రి పర్వతం దాటాలి.


Also Read: మీరు తినే ఆహారంపైనా నవగ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసా


6. వేంకటాద్రి 
వేం అంటే పాపం, కట అంటే తీసేయడం. అంటే పాపాలు తొలగించేది అని అర్థం. అంతా చేయించేది బ్రహ్మమే.. అందుకే బహ్మం తెలిసిన వాళ్లు పిచ్చివాళ్లలా కనిపిస్తారు. అందుకే  జ్ఞాని, పిచ్చి వాడు ఒకెలా ఉంటారు. అలాంటి స్థితిని పొందడమే వెంకటాద్రి ఎక్కడ. 


7. నారాయణాద్రి 
అంటే తుల్యావస్థ ని కూడా దాటి, తానే బ్రహ్మముగా నిలబడిపోతారు.