Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఇవే

AP ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్నిఅట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుంచి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప్ర‌భుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ద‌శ‌ల‌వారీగా 2025-26 సంవ‌త్స‌రంలో రూ.1.74కోట్లు, 2026-27 సంవ‌త్స‌రంలో రూ.1.13కోట్లు, 2027-28 సంవ‌త్స‌రానికి రూ.1.13కోట్లు ప్ర‌భుత్వ అట‌వీశాఖ‌కు విడుద‌ల చేసేందుకు నిర్ణ‌యించారు.

⁠తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, అమ‌రావ‌తి వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నారాయ‌ణ‌వ‌నం క‌ళ్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, క‌పిల‌తీర్థం క‌పిలేశ్వ‌ర‌స్వామి ఆల‌యం, నాగాలాపురం వేద‌నారాయ‌ణ‌స్వామి ఆల‌యం, ఒంటిమిట్ట కోదండ‌రామ స్వామి ఆల‌యాల అభివృద్ధి కోసం స‌మ‌గ్ర  ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుంచి సాంకేతిక‌, ఆర్థిక ప్ర‌తిపాద‌న‌లు స్వీక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

⁠తిరుమ‌ల‌ విశ్రాంత భ‌వ‌నాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్ద‌రు దాత‌లు స్పందించ‌లేదని..దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్ల‌ను TTDనే మార్చాలని నిర్ణయించారు. ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విష‌యంలో వారితో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

⁠తిరుమ‌ల‌లో బిగ్ క్యాంటీన్లు, జ‌న‌తా క్యాంటీన్ల లైసెన్సు ఫీజు నిర్ణ‌యించే అంశాన్ని ఆమోదించారు. భ‌క్తులకు నాణ్య‌మైన ఆహారం అందించేందుకు పేరుపొందిన సంస్థ‌ల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

⁠ఆకాశ‌గంగ‌, పాప‌వినాశ‌నం ప్రాంతాల‌ను భారీగా భక్తులు సందర్శిస్తున్నందున ఆ ప్రదేశాల్లో ఆధ్యాత్మిక, ప‌ర్యావ‌ర‌ణ‌, మౌలిక స‌దుపాయాలను మ‌రింత మెరుగు పర్చేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని నిర్ణ‌యించారు

⁠రాయ‌ల‌సీమ‌కే త‌ల‌మానికంగా  ఎంద‌రో పేదలకు మెరుగైన వైద్య సేవ‌లు  అందిస్తున్న స్విమ్స్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఆర్థిక స‌హాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60కోట్ల‌తో పాటు అద‌నంగా మ‌రో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదించారు. స్విమ్స్ మ‌రింత మెరుగైన వైద్య సేవ‌లు అందించేంద‌ుకు ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం చేప‌ట్టేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. అదేవిధంగా 85శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భ‌వంతుల‌ను త్వ‌ర‌లోనే మిగిలిన ప‌నుల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణ‌యం. శ్రీ‌వారి వైద్య సేవ‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు.

⁠టీటీడీలో ప‌ని చేస్తున్న అన్య‌మ‌త‌స్తులను బ‌దిలీ చేసేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాలు యోచిస్తున్నారు.దీంతో పాటూ స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణకు చ‌ర్య‌లు తీసుకునేందుకు ఆమోదించారు

⁠తిరుమ‌ల ఆల‌య భ‌ద్ర‌త‌ దృష్ట్యా యాంటీ డ్రోన్ టెక్నాల‌జీ వాడాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆధికారులను ఆదేశించారు.

⁠ఒంటిమిట్ట‌లో భ‌క్తుల‌కు అన్న‌దానం సేవ‌ల‌ను మరింత పెంచాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

⁠తుళ్లూరు మండ‌లం అనంత‌వ‌రంలో  తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న శ్రీ‌దేవి, భూదేవి స‌మేత‌ శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని అభివృద్ధి చేసేందుకు  రూ.10 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. 

⁠శ్రీ‌వారి నామావళిని రీమిక్స్ చేసి భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించిన‌ డీడీ నెక్ట్స్ లెవ‌ల్ చిత్రబృందంపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

అంతర్వాహిని సరస్వతి నది ఎక్కడ పుట్టింది.. పుష్కర స్నానాలు ఎక్కడచేయాలి..ఘాట్ల వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

సరస్వతి పుష్కర స్నానానికి కాళేశ్వరం వెళుతున్నారా...ఆ చుట్టుపక్కల చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

కాళేశ్వరంలో 12 ప్రత్యేకతలు.. సరస్వతి పుష్కరాలకు వెళ్లేవారు ఇవి మిస్సవకండి