ఆషాఢమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. తొలిఏకాదశి  రోజు రోజంతా ఉపవాసం ఉంది జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తి ని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తుల నమ్మకం. తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామివారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు. ఈ యోగ నిద్ర ద్వారా...భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనగా చెబుతారు.

Also Read: జులై 10 తొలి ఏకాదశి, ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిదని ఎందుకంటారు!

ఇంత ప్రత్యేకమైన ఈ రోజున మీ బంధువులు, సన్నిహితులు, స్నేహితులకు తొలిఏకాదశి శుభాకాంక్షలు చెప్పేందుకు కొన్ని కొటేషన్స్ మీకోసం..

1. ఓం నమోహః భగవతే వాసుదేవాయఃతొలి ఏకాదశి శుభాకాంక్షలు

2. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశంవిశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యంవందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు

3. ఓం శ్రీ  విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి,తన్నోవిష్ణుః ప్రచోదయాత్.మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు

4. వైకుంఠ: పురుషః ప్రాణః   ప్రాణదః ప్రణవః పృథుః ౹హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹తొలి ఏకాదశి శుభాకాంక్షలు

5. విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹తొలి ఏకాదశి శుభాకాంక్షలు

6. ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹దేవకీ నందనః స్రష్టా క్షితీశః పాపనాశనః తొలి ఏకాదశి శుభాకాంక్షలు

Also Read: గోరింట ఆషాడమాసంలోనే ఎందుకంత ప్రత్యేకం, దీని పుట్టుక వెనుక ఇంత కథ ఉందా!

7. లక్ష్మీనారాయణుడి దీవెనతో మీరు, మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ తొలిఏకాదశి శుభాకాంక్షలు

8. పరమపవిత్రమైన ఈ రోజున  శ్రీ మహా విష్ణువు కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని ఆకాంక్షిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

9. మీ తప్పులను మన్నించి ఆ శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

10. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్థిల్లేలా శ్రీ మహా విష్ణువు కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు 11. శ్రీ మహా విష్ణువును స్మరిస్తే జీవితం సంతోషమయంగా అవుతుంది తొలి ఏకాదశి శుభాకాంక్షలు

12. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ దూరమై అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ తొలి ఏకాదశి శుభాకాంక్షలు

Also Read: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!