Chanakya Niti on wealth: ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకడు. చాణక్య నీతిలో ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వివరించాడు. చాణక్యుడు వచనాల ద్వారా మానవ సంక్షేమం కోసం తన ఆలోచనలను అందించాడు. చాణక్యుడి విధానం విజయానికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. జీవితంలో విజయం సాధించాలంటే చాణక్యుడు సూచించిన ఏ సూత్రాలను పాటించాలో తెలుసా?


1. విజయం కోసం మొదటి సూత్రం


''నాట్యంతం సరళైర్భవ్యం గత్వా పశ్య వనస్థలిమ్|
ఛిద్యంతే సరళస్తత్ర కుబ్జస్తిష్ఠంతి పాదపః||''


అర్థం: అడవిలో మొదట నేరుగా పెరిగిన‌ చెట్లను నరికి వేస్తారు, ఎందుకంటే వంకర చెట్లతో పోలిస్తే నేరుగా చెట్లను కత్తిరించడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. అదే విధంగా ప్రతి ఒక్కరూ సూటిగా, వివేకంతో మాట్లాడే వ్య‌క్తితో మాట్లాడేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఈ కలియుగంలో విజయం నీరు వంటిది.. కాబట్టి కాస్త తెలివిగా మాట్లాడండి అని చాణ‌క్యుడు సూచిస్తున్నాడు.


2. విజయం కోసం రెండవ సూత్రం


''కః కాలః కన్ని మిత్రాణి కో దేశః కౌ వ్యాగమౌ|
కశ్చాహం కా చ మే శక్తిరితి చింత్యం ముహుర్ముహుః||''


అర్థం: మీరు మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవాలనుకుంటే.. సరైన సమయం, సరైన స్నేహితుడు, సరైన స్థలం, సరైన విధంగా ధ‌నం సంపాదించే సాధనాలు, డబ్బు ఖర్చు చేయడానికి సరైన మార్గంతో పాటు మీ శక్తి వనరులపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇది మీకు ప్రతి మార్గంలో విజయాన్ని ఇస్తుంది.


3. విజయం కోసం మూడవ సూత్రం


''యో ధ్రువాణి పరిత్యజ్య అధ్రువం పరిషేవతే|
ధ్రువణి తస్య నశ్యంతి చాధ్రువం అంతమేవ హి||''


అర్థం: సమస్తం తానే పొందాలనే దురాశ గలవాడు ధర్మాత్ములకు దూర‌మ‌వుతాడ‌ని చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పాడు. సరైన మార్గాన్ని విడిచిపెట్టి, తప్పుడు మార్గానికి మద్దతు ఇచ్చేవాడు వినాశన మార్గంలో పయనిస్తాడని నమ్ముతారు. అందుకే మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు, నిర్ణయం తీసుకునే ముందు తప్పో, ఒప్పో సరి చూసుకోవాల‌ని చాణ‌క్యుడు సూచించాడు.


4. విజయం కోసం నాలుగో సూత్రం


"గుణైరుత్తంతం యాతి నోచైరాసనసంస్థితః|
ప్రసాదశిఖరస్థో ⁇ పి కాకః కి గరుడయతే||''


అర్థం: ఒక వ్య‌క్తి తన పనులు, గుణాల ఆధారంగా గొప్పవాడిగా గుర్తింపు పొందుతాడు. పండితుడు పేదవాడు కావచ్చు కానీ ధనవంతులు కూడా అతన్ని గౌరవిస్తారు. డబ్బు, ఐశ్వర్యం, హోదాతో గొప్పవాడు కాలేడని, స‌రైన గుణం లేకుంటే అటువంటి వ్య‌క్తి రాజభవనం పైన కూర్చున్న కాకి లాంటివాడ‌ని  చాణ‌క్యుడు పేర్కొన్నాడు.


Also Read : కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఒక్క పని చేయండి


చాణక్య నీతి ప్రకారం, పైన పేర్కొన్న 4 సూత్రాలను లేదా జీవిత విలువలను ఎవరైతే త‌మ జీవితానికి అన్వ‌యించుకుని ఆచ‌రిస్తారో, ఆ వ్య‌క్తి ఖచ్చితంగా జీవితంలో విజయవంతమైన వ్యక్తి అవుతాడని తెలిపారు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.