చంద్రుడి ప్రభావం మనిషి ఆరోగ్యంపై, ముఖ్యంగా ఆలోచనలపై ఉంటుందని పలు అధ్యనాలతో పాటూ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా పేర్కొన్నారు. అందుకే చంద్రుడిని మనఃకారకుడు అంటారు. ఇంతకీ చంద్రుడి ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుందో  వివరిస్తూ కొన్ని విషయాలు ప్రస్తావించారు పండితులు. అవేంటో చూద్దాం..


చంద్రుడి శ్లోకం
దథిశంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్ |
నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ‖


అమావాస్య-పౌర్ణమికి పిచ్చి ముదురుతుందా!


అమావాస్య పౌర్ణమికి రోగం పెరుగుతుందని, పిచ్చి ముదురుతుందని అంటుంటారు. అసలు తిథులకు-ఆరోగ్యానికి సంబంధం ఏంటంటే 
పౌర్ణమి రోజు సూర్యచంద్రులు ఇద్దరూ భూమికి ఇరువైపులా ఒకేస్థాయిలో ఆకర్షణ కలిగి ఉంటారు. చంద్రుడు జలకారకుడు..మనిషి శరీరంలో నీరుంటుంది. చంద్రుడు నీటికారకుడు కావడంతో విపరీతంగా ఆకర్షిస్తాడు అందుకే వ్యాధిగ్రస్తులకు ఉన్న రోగం పెరుగుతుంది, మానసికంగా మరింత వేదనకు గురవుతారు. అందుకే పెద్దలంటుంటారు కదా.. అమావాస్య, పౌర్ణమి వచ్చిందంటే పిచ్చి ముదురుతుందని.. దానివెనుకున్న ఆంతర్యం ఇదే


Also Read: ఈ నెలలో ఈ రాశులవారి కలలు నిజమవుతాయి, ఆగష్టు రాశిఫలాలు


మూడ్ స్వింగ్స్‌
మనిషి మెదడులో ఆటుపోట్లకు చంద్రుడు కారణం. మెదడులో నీటి శాతం ఎక్కువ ఉన్నందున, చంద్రుని గురుత్వాకర్షణ శక్తి మీ మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని డచ్ పరిశోధకులు చెప్పారు. అందుకే పౌర్ణమి, అమావాస్య రోజు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయనేది  డచ్ పరిశోధకుల అధ్యయన సారాశం. 


మూర్ఛవ్యాధిని తగ్గిస్తుంది
బ్రిటీష్ శాస్త్రవేత్తలు చేసిన ఇతర అధ్యయనాల ప్రకారం నిండు పౌర్ణమి , మూర్ఛ వ్యాధిగ్రస్తులలో మూర్ఛలు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. చంద్రుడు ప్రకాశవంతంగా ఉన్నప్పుడు మూర్చ రోగుల్లో ఎపిలెప్టిక్ మూర్ఛలు తక్కువ ఉన్నట్లు వారు గమనించారు. సూర్యుడు అస్తమించినప్పుడు మీ మెదడులో సహజంగా స్రవించే మెలటోనిన్ అనే హార్మోన్ దీనికి కారణం అవుతుందట. పున్నమి చంద్రుడి కిరణాలు సోకిన రోజు ఈ  హార్మోన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధ్యనంలో స్పష్టమైంది


హృదయ స్పందన పెరుగుతుంది
చంద్రుడి కాంతి కిరణాలు ఓ వ్యక్తి హృదయ స్పందనలపై ప్రభావం చూపుతాయని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నిత్యం వ్యాయామం చేసేవారు ఇది గమనిస్తే మామాలు రోజుల్లో వ్యాయామం చేసేటప్పటి కన్నా పౌర్ణమి, అమావాస్య రోజు వ్యాయామం చేస్తే హృదయస్పందన హెచ్చుగా ఉంటుంది. అందుకే పౌర్ణమి , అమావాస్య రోజు వ్యాయామం చేసే తీవ్రతను తగ్గించాలని సూచిస్తారు.


Also Read: భోళా శంకరుడికి అవతారాలున్నాయి


స్త్రీలలో ఋతుచక్రంపై ప్రభావం
స్త్రీలలో సగటు ఋతు చక్రం 28 రోజులు, ఇది  చంద్రుడి చక్రంతో సమానంగా ఉంటుంది. చైనీస్ పరిశోధకుల ప్రకారం స్త్రీలలో  పౌర్ణమి దగ్గరలో అండోత్సర్గము, అమావాస్య సమయంలో ఋతుస్రావం అవుతుందని గుర్తించారు. భూమిపైన సంతానోత్పత్తికి చంద్రుడి ప్రభావానికి ఇది నిదర్శనం అంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.


కిడ్నీ నొప్పి
యూరాలజీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పౌర్ణమి సమయంలో కిడ్నీ స్టోన్ నొప్పి అధికంగా ఉంటుందట. ఈ సమయంలో ఎక్కువ మంది రోగులు ఆసుపత్రులలో చేరినట్టు కనుగొన్నారు. అదే అమావాస్య రోజున కిడ్నీలలో నొప్పి నుంచి ఉపశమనం ఉన్నట్లు గుర్తించారు. 


ఇంకా పౌర్ణమి,అమావాస్య రోజు చంద్రుడి ప్రభావం ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో పేర్కొన్నారు. అందుకే ఆ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలి సూచిస్తారు పెద్దలు


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం  పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial