Monthly Horoscope for August 2023: ఆగస్టు నెల చాలా రాశులవారి జీవితాల్లో సానుకూలమార్పులు తీసుకురానుంది. కొన్ని రాశులవారు విజయంతో పాటూ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. గ్రహాలు, రాశుల స్థానం పరంగా కూడా ఆగస్టు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. పైగా ఈ నెలలో పెద్ద గ్రహాలు కొన్ని రాశి మారుతున్నాయి. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి ధనలాభం ఉంటే మరికొన్ని రాశులవారిలో ఆందోళనలు అధికమవుతాయి. ఆగష్టు నెల మీకెలా ఉందో తెలుసుకోండి


మేష రాశి 
ఆగష్టు నెల మేషరాశి వారికి గ్రహ సంచారం బావుంది.  ఆర్థిక పరంగా మంచిది. మీ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇదే మంచిసమయం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఆగష్టు మంచిదే. ఈ నెల రెండోవారం తర్వాత ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. నిరుద్యోగులు ఉద్యోగాల్లో స్థిరపడతారు. వ్యాపారంలో లాభాలుంటాయి. శత్రువులపై ఆధిత్యక సాధిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి.


వృషభ రాశి 
వృషభ రాశి వారికి ఆగష్టు నెలలో కూడా గ్రహసంచారం బాగానే ఉంది.  వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఈ నెలలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు


Also Read: భోళా శంకరుడికి అవతారాలున్నాయి


మిథున రాశి
ఆగష్టు నెల ఈ రాశివారికి కొత్త అవకాశాలను తెస్తుంది. విదేశీ ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ నెలలో ప్రమోషన్ పొందొచ్చు లేదంటే ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారం బాగా జరుగుతుంది. నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థికపరంగా మీకు చాలా మంచి నెల ఆగష్టు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది.


కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ఈ నెల ప్రారంభంలో కెరీర్ కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ రానురాను బావుంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అన్నిరంగాలవారికి వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. మీపై పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.  ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచి అవకాశం. సరైన సమయానికి ధనం చేతికందుతుంది. వ్యాపారస్తులు నూతన ప్రయోగాలు చేసేందుకు ఇదే మంచి నెల. 


సింహ రాశి
సింహ రాశి వారికి ఆగష్టు నెలలో గ్రహంచారం బాగాలేనందున చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. తీవ్రంగా కృషి చేస్తేనే తగిన ఫలితం పొందుతారు.   మీకు ప్రమోషన్ లభిస్తుంది. కొత్త అసైన్‌మెంట్ పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగులతో స్నేహంగా మెలగండి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. వ్యాపారంలో లభాలు ఆర్జిస్తారు.


కన్యా రాశి 
కన్యారాశి వారికి ఈ నెల ప్రారంభం బాగానే ఉంటుంది కానీ ముగింపు మధ్యస్తంగా ఉంటుంది. అష్టమంలో, జన్మంలో గ్రహసంచారం వల్ల ఇబ్బందులుంటాయి. కొన్ని ఊహించని సంఘటనలు మీ వేగాన్ని తగ్గించవచ్చు ,  మీరు ఆశించిన ఫలితాలను సాధించనీయకుండా చేయొచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది కానీ మొదటి పక్షం రోజుల తర్వాత కొన్ని ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ ను పాడుచేస్తాయి. కుజుడి ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 


Also Read: వీధిపోటు ఈ దిశగా ఉంటే ఆస్తి నష్టం, కోర్టు కేసులు - ఆ 4 దిశల్లో ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం!


తులా రాశి
ఈ నెలలో రవి,శుక్రుడు,బుధుడు బలం బావుండడం వల్ల ఆర్థికంగా బావుంటుంది. గతంలో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. వ్యాపారం బాగానే ఉంటుంది. నెల మధ్య నుంచి 12వ స్థానంలో కుజుడి సంచారం వల్ల వృత్తిలో కొంత వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. కొన్ని ప్రణాళికలు తప్పుకావడంతో వాటి ప్రభావంమీపై పడుతుంది. చేపట్టిన పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు చేయగలను అని నమ్మినప్పడు మాత్రమే బాధ్యతలు స్వీకరించండి. వ్యాపారులకు ఈ నెల ప్రారంభంలో కొన్ని  ఒడిదొడుకులు ఎదురవుతాయి కానీ గడిచేకొద్దీ సానుకూల ఫలితాలొస్తాయి. భార్య భర్తల మధ్య విభేదాలు ఉండొచ్చు


వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి ఈ నెల బావుంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్యం బావుంటుంది. సంతానం ద్వారా మంచి వార్తలు వింటారు.  చిన్న ఇబ్బందులున్నా తొలగిపోతాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు.


ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఆగష్టు నెల అదృష్టం కలిసొస్తుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా ఏ లోటు ఉండదు. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది.మీరు కనే కలలు నిజమవుతాయి.  వ్యాపారులు తమ పనిని విస్తరించి మంచి లాభాలు పొందుతారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోతారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు


మకర రాశి
మకరరాశివారు ఆగష్టునెలలో తమ వృత్తిలో  కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. అష్టమంలో గ్రహ సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వారి మధ్య విభేదాలు ఉండవచ్చు, ఇది చీలికకు దారితీయవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో మీకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.


కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ నెలలో అష్టమ కుజుడి ప్రభావం అధికంగా ఉంటుంది.  ఈ నెలలో మనుగడ సాగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ సహోద్యోగులు సహకరించకపోవచ్చు. మీరు చెప్పుడు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందర్నీ నమ్మేయవద్దు. ఓపికగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవ్వరితోనూ వివాదం పెట్టుకోవద్దు, కఠినమైన పదాలు వినియోగించవద్దు. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది. వాహనప్రమాదాలుంటాయి జాగ్రత్త. వ్యాపార వ్యవహారాలు అనుకూలించవు


మీన రాశి
ఈ రాశివారికి ఈ నెలలో కొన్ని సమస్యలు తీరుతాయి. కానీ సప్తమంలో కుజుడి ప్రభావం వల్ల కోపం అధికంగా ఉంటుంది.  ఉద్యోగులు సీనియర్ల నుంచి  పని ఒత్తిడి ఎదుర్కొంటారు. మీరు మీలక్ష్యాలు సాధించేందుకు చాలా కష్టపడాలి. అనుకోని ఖర్చులు మీ బడ్జెట్ పై ప్రభావం చూపిస్తాయి. వ్యాపారులు చాలా కష్టపడితే  సాధారణ ఫలితాలు అందుకుంటారు. కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి.