Vastu Tips In Telugu: వీధి పోటులో చాలా రకాలున్నాయి. చాలా వరకు వీధిపోట్ల వల్ల ఇబ్బందులు తలెత్తితే, మరికొన్ని రకాల వీధి పోట్లు వల్ల శుభఫలితాలుంటాయి. ఏ వైపు ఉంటే మంచిది ఏ వైపు ఉంటే వీధిపోటు మంచిదికాదో చూద్దాం


వీధిపోటు అంటే
వీధిలో వెళ్లేవారి అందరి దృష్టీ ఆ  ఇంటిపై పడేలా నిర్మాణం ఉంటే దాన్ని వీధి పోటు అంటారు. కొన్ని వీధిపోట్లు అక్కడకవరకూ వచ్చి నిలిచిపోతుంటే.. మరికొన్ని అక్కడి వరకూ వచ్చి పక్కకు తిరుగుతాయి. మరికొన్ని స్థలం మూలల్ని తాకుతూ ముందుకు పోతాయి. వీటిలో ఏ దిక్కున వీధిపోటు ఉంటే మంచిది, ఏ దిక్కున ఉంటే మంచిది కాదో చూద్దాం..


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ వాహనం( టూ వీలర్ or ఫోర్ వీలర్) ఏ రంగు ఉండాలో తెలుసా!


ఈ నాలుగు దిక్కులవైపు వీధిపోటు ఉంటే మంచిది
ప్రతి దిక్కుని మూడు భాగాలు చేయాలి- దిగువ పక్క మూడో భాగంలో వచ్చే రోడ్డు పోటు మంచిది



  • తూర్పు వైపు - తూర్పుఈశాన్యం

  • ఉత్తరం- ఉత్తర ఈశాన్యం

  • పడమర- పడమర వాయువ్యం

  • దక్షిణం- దక్షిణ ఆగ్నేయం


ఈ రోడ్డు పోటు మంచిదే. అయితే ఇంటి ఎంట్రన్స్ కి కాకుండా బాల్కనీకి, ఖాళీజాగాకు వస్తే మంచిదే.


వీధి పోటు ఎటు ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే


తూర్పు వైపు రోడ్డు పోటు



  • తూర్పువైపు ఉంటే - మనశ్సాంతి ఉండదు

  • తూర్పు ఆగ్నేయం- ఆ ఇంట ఇల్లాలి ఆరోగ్యం చెడిపోతుంది, మనశ్సాంతి ఉండదు

  • తూర్పు ఈశాన్యం- మనశ్సాంతి, ఐశ్వర్యం


దక్షిణం వైపు రోడ్డు పోటు



  • దక్షిణం- యజమానికి మరణం, ఇంట్లో ఉన్న మగపిల్లాడికి మరణం

  • దక్షిణ ఆగ్నేయం- ఇంట్లో అందరి ఆరోగ్యం బావుంటుంది

  • దక్షిణ నైరుతి- వారసులు బతికి ఉండరు


Also Read: వాస్తు ప్రకారం ఈ దిశలో ప్రహరీగోడ కూలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి!


పడమర వైపు రోడ్డు పోటు



  • పడమర- దంపతుల మధ్య కలహాలు, విడిపోతారు, అవివాహితులకు పెళ్లిళ్లు కావు

  • పడమర నైరుతి -అప్పుల పాలు

  • పడమర వాయువ్యం- రాజయోగం, రాజకీయ నాయకులకు మంచిది


ఉత్తరం వైపు రోడ్డు పోటు



  • ఉత్తర వాయువ్యం- ఇంట్లో నిత్యం కలహాలు

  • ఉత్తరం- ఆస్తి నష్టం, కోర్టు కేసులు

  • ఉత్తర ఈశాన్యం- యజమానికి ఆయుష్షు పెరుగుతుంది, ఇంట్లో మనశ్సాంతి ఉంటుంది. 


రోడ్డు పోటుని ఎలా గుర్తించాలి



  • రోడ్డు ఇంటికి అభిముఖంగా వచ్చి తగలడాన్ని రోడ్డు పోటు అంటారు

  • రోడ్డు పోటు వచ్చిన రహదారి వెడల్పు కన్నా మధ్యలో ఇంకో పెద్ద రోడ్డు ఉంటే ఆ రోడ్డు పోటు ప్రభావం ఉండదు

  • ఆ రోడ్డు నుంచి చాలా ఎక్కువ మంది వెళ్లడం వల్ల వారి చూపు, ఆ ఇంటిపై పడి ఆ ఇంటి లక్ష్మీస్థానానికి యజమాని దూరమవుతాడు. అందుకే రోడ్డు పోటు ఉండకూడదు అంటారు.

  • రోడ్డు పోటు వల్ల ఇబ్బందులు తొలగాలంటే..రోడ్డు పోటుకి అభిముఖంగా వినాయక విగ్రహం పెట్టాలి. వాస్తు పూజలు చేయించాలి.


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.