Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే యూత్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి థియేటర్ల వద్ద అభిమానుల క్యూలు కడతారు. దక్షిణాదిన పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మరో హీరోకు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాలోనూ పవన్ కు అదే ఫాలోయింగ్. ఇప్పటి వరకూ ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ఖాతాల్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ కొత్తగా పాపులర్ సోషల్ మీడియా యాప్ అయిన ఇన్‌స్టాగ్రామ్ లో కూడా అడుగుపెట్టారు. తాజాగా మంగళవారం(జూన్ 4) న ఆయన ఇన్‌స్టా ఖాతాను ఓపెన్ చేశారు. అకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్స్ లో ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 


కొన్ని గంటల్లోనే 1.6 మిలియన్స్ దాటిన ఫాలోవర్స్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయంగానూ యాక్టీవ్ గా ఉంటున్నారు. అయితే తన అభిప్రాయాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన కూడా సోషల్ మీడియాను ఉపయోగించడం ప్రారంభించారు. గతంలో ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పవన్ ఖాతాలను ఓపెన్ చేశారు. ట్విట్టర్ నుంచి ఎక్కువగా పొలిటికల్ గా పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లోకి కూడా పవన్ అడుగుపెట్టారు. జులై 4న ఇన్‌స్టా అకౌండ్ ను ఓపెన్ చేశారు. ఈ అకౌంట్ ను ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశారు. తర్వాత ఆ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ప్రస్తుతానికి ఆయన ఇన్‌స్టా ఫాలోవర్స్ 1.6 మిలియన్స్ మంది. ఇది సోషల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. 


ఒక్క సింగిల్ పోస్ట్ కూడా లేకుండానే..


పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేయడంతో ఆయన అభిమానులు హర్షం  వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన ఫాలోవర్స్ గంటగంటకీ లక్షల్లో పెరిగిపోతున్నారు. కానీ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సోషల్ మీడియాలో మిలియన్స్ లో ఫాలోవర్స్ రావడానికి కాస్త సమయం పడుతుంది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాలోకి అడుగుపెట్టగానే కొద్ది సేపటికే అకౌంట్ వెరిఫై అయిపోయింది. కొన్ని గంటల్లో వన్ మిలియన్ దాటిపోయారు. ఇంకా ఆ సంఖ్య పెరుగుతోంది. ఒక్క పోస్ట్ కూడా పెట్టకుండానే ఇంత మంది ఫాలోవర్స్ అంటే ఇక పోస్ట్ లు చేయడం ప్రారంభింస్తే ఇంకెంత మంది ఫాలోవర్స్ వస్తారో అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇక పవన్ ఇన్‌స్టా వేదికగా రాజకీయాలతో పాటు సినిమా విశేషాలను కూడా షేర్ చేయనున్నారని తెలుస్తోంది. ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో... జై హింద్ అనే స్లోగన్ ను ఇన్‌స్టా ఖాతాకు జత చేశారు పవన్.


ఇతర హీరోలకు ఎంత టైమ్ పట్టిందంటే..


సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడం అంటే సాధారణ ప్రజలకు అది కాస్త కష్టమనే చెప్పాలి. వాస్తవానికి సినిమా, స్పోర్ట్స్, పొలిటికల్ రంగాల్లో ఉన్న చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఖాతాల్లో మిలియన్స్ మంది ఫాలోవర్స్ ను సాధించడానికి కాస్త సమయం పడుతుంది. అయితే స్టార్ హీరోలకు మాత్రం ఇలాంటి రికార్డులు చాలా సులువుగా సాధిస్తారు. మన టాలీవుడ్ లోనూ సోషల్ మీడియాలో అడుగుపెట్టి కొన్ని రోజుల్లో లక్షలాది మంది ఫాలోవర్స్ ను పెంచుకున్న హీరోలు ఉన్నారు. హీరో ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఓపెన్ చేసిన తర్వాత వన్ మిలియన్ ఫాలోవర్స్ రావడానికి 23 రోజుల సమయం పట్టింది. అలాగే రామ్ చరణ్ కు 74 రోజులు, మహేష్ బాబుకి 89 రోజులు, అల్లు అర్జున్ కి 184 రోజులు, ఎన్టీఆర్ కు 416 రోజులు సమయం పట్టింది. అయితే పవన్ కళ్యాణ్ కి మాత్రం ఇన్‌స్టా ఓపెన్ చేసిన 380 నిమిషాల్లోనే 1 మిలియన్ మంది ఫాలోవర్స్ రావడం పవన్ స్టామినాను మరోసారి రుజువు చేసిందనే చెప్పాలి.


విడుదలకు సిద్దంగా ‘బ్రో’..


పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు ముందే పెండింగ్ లో ఉన్న సినిమాలు అన్నీ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన రీసెంట్ గా నటించిన ‘బ్రో’ సినిమాను పూర్తి చేశారు. ఈ సినిమాలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలసి నటించారు పవన్. ‘బ్రో’ మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. దీంతో పాటు సుజిత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. అలాగే హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’, క్రిష్ జాగర్లమూడితో పీరియాడికల్ మూవీ ‘హరి హర వీర మల్లు’లోనూ నటిస్తున్నారు పవన్ కళ్యాణ్.


Also Read: అజిత్ దర్శకుడితో కమల్ హాసన్ సినిమా - ఇది అఫీషియల్