Srishaila Bhramarambi in Chandraghanta Alankaram:  శ్రీశైలంలో శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ భ్రమరాంబిక నవదుర్గల అలంకారంలో దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు చంద్రఘంట అలంకారంలో దర్శనమిస్తోంది . ఈ అలంకారంలో ఉన్న భ్రమరాభింకను పూజిస్తే జీవితంపై ఆశ, విశ్వాసం పెరుగుతుంది. చంద్రఘంటను పూజించే ఇంట ప్రతికూలశక్తులు దరిచేరవు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో నిరాశతో ఉండేవారు చంద్రఘంటను పూజిస్తే నూతన అవకాశాలు, బతుకుపై ఆశ పెరుగుతుంది.  


బహ్మచారిణిగా శివుడి కోసం తపస్సు చేసిన అమ్మవారిని  వివాహం చేసుకునేందుకు అయ్యవారు స్వయంగా హిమవంతుడి ఇంటికి దిగొచ్చారు. తన వివాహా వేడుకకు మునులతో, దేవతలతో , గణాలతో , స్మశానంలో ఉండే భూత ప్రేత పిశాచాలతో సహా తరలివచ్చాడు శంకరుడు. పార్వతి దేవి తల్లి అయినా మేనకా దేవి శివుని భయంకరమైన రూపం చూసి కళ్లు తిరిగి పడిపోతుంది. అప్పుడు పార్వతీదేవి  చంద్రఘంట అవతారంలో శివునికి కనిపించి .. ఆ భయంకరమైన రూపాన్ని మార్చుకోమని కోరింది. ఆ క్షణమే పరమేశ్వరుడు చక్కని రాజకుమారుడిలా నగలతో మెరిసిపోయాడు.


నుదుటన చంద్రుడిని ధరించడంతో అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. చేతుల్లో కమలం, కమండలం, ఖడ్గం, త్రిశూలం, విల్లు, గద, బాణం, జపమాలతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మను దర్శించుకుంటే శత్రునాశనం ఉంటుందని చెబుతారు.  


Also Read: వైష్ణోదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. IRCTC నార్త్ ఇండియా టూర్​ ప్రత్యేక ప్యాకేజీ!


చంద్రఘంట దేవి మంత్రం


ఓం దేవి చంద్రగుటాయై నమః
ఓం దేవి చంద్రగుటాయై నమః పిండాజ్ ప్రవార్ధ్ చండ్కోపష్ర్కైర్యుట
ప్రసాదమ్ తనుతే మధ్యమ్ చంద్రఘంటేటి విశృతా


చంద్రఘంట దేవి ప్రార్థన 


పిండజా ప్రవారారుధ చండకోపస్త్రకైర్యుట
ప్రసాదమ్ తనుతే మహ్యం చంద్రఘంటేటి విశృతా !


చంద్రఘంట దేవి స్తుతి 


యా దేవి సర్వభూతేషూ మా చంద్రఘంట రూపేనా సమస్తిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


Also Read: దేవీనవరాత్రులు ప్రారంభం , కలశ స్థాపన - ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇది!


చంద్రఘంట దేవి ధ్యానం 


వందే వాన్ఛితాభాయ చంద్రార్ధక్రితశేఖరం
సింహరుధ చంద్రఘంట యశస్వినీమ్
మణిపురా స్థితం తృతీయ దుర్గ త్రినేత్రం
ఖంగా, గధ, త్రిశూల, చపశార, పద్మ కమండాలు మాల వరభిటకరం
పటంబరా పరిధానమ్ మృదుహస్య నానాలంకర భూషితాం
మంజీర, హర, కేయూర, కింకిని, రత్నకుండల మండితాం
ప్రపుల్ల వందన బిబాధర కంట కపోలమ్ తుగమ్ కుచాం
కమనీయం లావణ్యం క్షినకటి నితంబానిమ్


చంద్రఘంట దేవి స్తోత్రం


అపదుద్ధహారిని త్వంహి అధ్య శక్తిః శుభ్పరం
అనిమది సిద్ధిధాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం
చంద్రముఖి ఇష్ట ధాత్రి ఇష్టం మంత్ర స్వరూపిణి
ధానదాత్రి, ఆనందధాత్రి, చంద్రఘంటే ప్రణమామ్యహం
నానారూపధారిణి ఇచ్ఛమయి ఐశ్వర్యదాయిని
సైభగ్యరోగ్యదాయిని చంద్రఘంటే ప్రణమామ్యహం


చంద్రఘంట దేవి కవచం 


రహస్యం శ్రిను వక్ష్యామి షైవేశి కమలనానే
శ్రీ చంద్రఘంటేస్య కవచమ్ సర్వసిద్ధిదాయకం
బినా న్యాసం బినా వినియోగం బినా శపోద్ధ బినా హోమం
స్నానం శౌచది నాస్తి శ్రద్ధమత్రేన సిద్ధిదం
కుషిష్యం కుటిలయ వంచకాయ నిందకాయ చా
నా దతవ్యం న దతవ్యం న దతవ్యం కదచితాం 


ఓం శ్రీ మాత్రే నమః


Also Read: దసరా నవరాత్రులు సులువుగా చేసుకునే విధానం...పాటించాల్సిన నియమాలు