శ్రీ వేంకటేశ్వర అవతారం వెనుక కారణాలివే


కలియుగంలో భక్తుల పాపాలు కడిగేందుకు
ఒకరోజు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగాడట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారుట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా  వారి పాపాలని నేను తీసేస్తానని చెప్పాడట.


తల్లి యశోదకు చేసిన వాగ్దానం 
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి తల్లి దేవకి అయినా..పెంచిన తల్లి మాత్రం యశోద. అందుకే చిన్నికృష్ణుడి అల్లరి చూసే అదృష్టం ఆమెకు దక్కింది. అడగకుండానే రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. చిన్న కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనవి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాయగా పోతనాచార్యులు  తెలుగులోకి ఆంధ్రీకరించారు. కన్నయ్య అల్లరిని చూసిన అదష్టం దక్కినప్పటికీ రుక్మిణీ కల్యాణం చూడలేదనే కోరిక యశోదకి మిగిలిపోయింది.  అదే విషయాన్ని చెప్పడంతో.. కలియుంగలో నేను వేంకటేశ్వరునిగా అవతరిస్తాను..నువ్వు వకుళమాతగా వచ్చి కల్యాణం చేయించమనే వరమిచ్చాడట. 


Also Read: శరీరంలో ఏడు చక్రాలకి - తిరుమల ఏడుకొండలకి ఏంటి సంబంధం


వేదవతిని పెళ్లిచేసుకునేందుకు
సీతాదేవి భూమిలోంచి పుట్టినట్టుగానే వేదవతి కూడా దర్భల మీద దొరికింది. పెరిగి పెద్దదైన వేదవతితి పెళ్లిచేద్దామని సంకల్పించాడు తండ్రి. నేను సాక్షాత్తూ శ్రీనివాసుడినే వివాహం చేసుకుంటానని చెప్పింది. పార్వతీ దేవి శంకరుడి గురించి తపస్సు చేసినట్టే వదవతి కూడా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసింది. ఆ సమయంలో రావణుడు ఆమెను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా ...నువ్వు ఓ స్త్రీ వల్లే నాశనం అవుతావని శపించి అగ్నిప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు ఆమెను కాపాడి కుమార్తెగా స్వీకరించాడు. కొన్నాళ్ల తర్వాత సీతని ఎత్తుకుపోతున్న రావణుడిని అడ్డుకున్న అగ్నిహోత్రుడునీ రథంలో ఉన్నది మాయ సీత.. నా దగ్గర ఉన్నది అసలైన సీత అని చెప్పడంతో రావణుడు వేదవతిని తీసుకెళ్లాడట. సీత తరపున అశోకవనంలో ఉన్నది, రాముడిని రప్పించి రావణుడిని చంపించిందీ వేదవతి అని చెబుతారు. తన కార్యం పూర్తైన తర్వాత మళ్లీ తండ్రి అగ్నిహోత్రుడి దగ్గరకు వెళ్లిపోయింది వేదవతి. అయితే సీత స్థానంలో ఉన్న ఆమెను స్వీకరించేందుకు అంగీకరించని రాముడు... ఈ అవతారంలో ఏకపత్నీ వ్రతుడిని, కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించి వేదవతి( పద్మావతి) ని పెళ్లిచేసుకుంటానని మాటిచ్చాడట. 


Also Read: శ్రీ వేంకటేశ్వరుడికి శనివారం అంటే ఎందుకు ఇష్టం