లగ్జరీ కార్ల తయారీ బ్రాండ్ లెక్సస్ మనదేశంలో కొత్త తరం ఎన్ఎక్స్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఇది రెండో తరం లగ్జరీ ఎస్‌యూవీ. దీని డిజైన్ చూడటానికి ముందు నుంచి షార్ప్‌గా ఉంది. పెద్ద స్పిండిల్ గ్రిల్, కొత్త హెడ్ ల్యాంప్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీని సైడ్ ప్రొఫైల్ చూడటానికి స్పోర్ట్స్ లుక్‌తో ఉంటుంది. పెద్దగా ఉండే 20 అంగుళాల వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి.


ఇక వెనకవైపు స్టైలింగ్ చూస్తే టేపరింగ్ రూఫ్ లైన్ అందించారు. లైట్ బార్ వెనకవైపు ల్యాంప్స్‌కు కనెక్ట్ అయింది. దీని ఇంటీరియర్ కూడా ఎంతో కొత్తగా ఉంది. 14 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇందులో ఉంది. 


దీని ఇంటీరియర్ డిజైన్ కూడా మారిపోయింది. ఈ కొత్త ఎన్ఎక్స్‌లో సరికొత్త సేఫ్టీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ప్రీ-కొలిజన్ సిస్టం, డైనమిక్ రాడార్ క్రూజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ అలెర్ట్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, ఆటో హై బీం సిస్టం వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో అందించారు.


బ్లైండ్ స్పాట్ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్ (ఆర్సీటీఏ), రేర్ కెమెరా డిటెక్షన్ (ఆర్సీడీ) కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్‌యూడీ, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సీట్లు, ముందువైపు/వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.


లెక్సస్ ఎన్ఎక్స్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌క్విజిట్, లగ్జరీ, ఎఫ్-స్పోర్ట్ వేరియంట్లు ఇందులో ఉన్నాయి. ఎన్ఎక్స్ 350 హెచ్ ఎక్స్‌క్విజిట్ ధర రూ.64.9 లక్షలు కాగా... ఎన్ఎక్స్350హెచ్ లగ్జరీ వేరియంట్ ధర రూ.69.5 లక్షలుగా ఉంది. ఇక ఎన్ఎక్స్ 350 హెచ్ ఎఫ్-స్పోర్ట్ ధర రూ.71.6 లక్షలుగా ఉంది.