వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి కేటాయించి పూజలు చేస్తుంటారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం గణపతి లేదా అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామి, ఆదివారం సూర్యుడు.. ఇలా ఆయా రోజుల్లో ఆ దేవుళ్లని పూజించడం ద్వారా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి విషయానికొస్తే శనివారం అంటే ఎందుకు ఇష్టం.
వెంకటేశ్వర స్వామిని శనివారం ఎందుకంత ప్రీతి
- ఓంకారం ప్రభవించిన రోజు శనివారం
- శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్లకు శనీశ్వరుడు పీడించనని మాట ఇచ్చిన రోజు శనివారం
- వెంకటేశ్వర స్వామిని భక్తులు మొట్ట మొదటి సారి దర్శించిన రోజు శనివారం
- ఆలయం నిర్మాణం చేయమని శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం
- శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే
- వేంకటేశ్వర స్వామి సుదర్శనం పుట్టినది కూడా శనివారమే
- అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే అత్యంత ప్రీతికరం
Also Read: శివుడికి వీటితో అభిషేకం చేస్తే స్థిరాస్తులు కొనుగోలు చేస్తారట
ప్రతి శనివారం రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే అంతా శుభమే కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనిదేవుడి దోషం కూడా పోవాలంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజచేయాలని, ఆలయానికి వెళ్లి 7 ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అనుకున్నవి నెరవేరతాయని పండితులు చెబుతారు.
Also Read:శివుడుని 'లయకారుడు' అని ఎందుకంటారు
శ్రీ వేంకటేశ్వర అష్టకమ్
శేషాద్రివాసం శరదిందుహాసం
శృంగారమూర్తిం శుభదానకీర్తిం
శ్రీ శ్రీనివాసం శివదేవ సేవ్యం
శ్రీ వేంకటేశం శిరసా నమామి
సప్తాద్రి దేవం సురారాజ సేవ్యం
సంతాప నాశం సువిలాస కోశం
సప్తాశ్వ భాసం సుమనోజ్ఞ భూషం
శ్రీ వేంకటేశం శిరసా నమామి
భూలోక పుణ్యం భువనైక గణ్యం
భోగీంద్ర చక్ర భవరోగ వైద్యం
భాస్వత్కిరీటం బహు భాగ్యవంతం
శ్రీ వేంకటేశం శిరసా నమామి
లోకాంత రంగం లయకార మిత్రం
లక్ష్మీకళత్రం లలితాబ్జ నేత్రం
శ్రీ విష్ణు దేవం సుజనైక గమ్యం
శ్రీ వేంకటేశం శిరసా నమామి
వీరాధి వీరం విమగాది రూఢం
వేదాంత వేద్యం విబుదాశి వంద్యం
వాగీశ మూలం వరపుష్పమాలిం
శ్రీ వేంకటేశం శిరసా నమామి
సంగ్రామ భీమం సుజనాభి రామం
సంకల్ప పూరం సమతా ప్రచారం
సర్వత్ర సంస్థం సకలాగమస్తం
శ్రీ వేంకటేశం శిరసా నమామి
శ్రీ చూర్ణఫాలం సుగుణాలవాలం
శ్రీ పుత్రితాతం శుకముఖ్యం గీతం
శ్రీ సుందరీశం శిశిరాంత రంగం
శ్రీ వేంకటేశం శిరసా నమామి
సంమోహ దూరం స్సుఖ శిరుసారం
దాక్షిణ్యభావం దరహాస శోభం
రాజాధి రాజం రమయా విహారం
శ్రీ వేంకటేశం శిరసా నమామి