Hanuman Jayanti 2024: అంజనా దేవి - కేసరి సంతానం ఆంజనేయుడు..వాయుపుత్రుడు ఆంజనేయుడు..రుద్రాంశ సంభూతుడు ఆంజనేయుడు.. ఇంతకీ హనుమాన్ జన్మరహస్యం ఏంటి? పురాణాల్లో ఏముంది...
శివపురాణంలో ఏముందంటే..
రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో పరమేశ్వరుడు తన వీర్యాన్ని స్కలనం చేశాడు. దాన్ని సప్తర్షులు అంజనాదేవి చెవిద్వారా ప్రవేశపెట్టారు. అలా రుద్రుడి అంశగా మహాబల పరాక్రమాలుగల వానరదేహంతో ఆమెకు జనించాడని చెబుతారు..అందుకే శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ: అని శివమహాపురాణంలో ఉంది..తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల...ఆంజనేయుడిని శివావతారుడిగా కీర్తిస్తారు.
Also Read: పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
పరాశర సంహితలో
శంకరుడి పదకొండో అవతారమే హనుమంతుడు అని పరాశర సంహిత చెప్పింది..త్రిపురాసుర సంహారంలో శ్రీ మహావిష్ణువు శివుడికి సహకరించడం వల్ల అందుకు కృతజ్ఞతగా త్రేతాయుగంలో రాముడికి సహాయం చేసేందుకు హనుమంతుడిగా వచ్చాడని చెబుతారు. రాక్షస సంహారం కోసం శ్రీ మహా విష్ణువు సూచనల మేరకు త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. శివుడి వీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నికి.. అగ్ని వాయుదేవుడికి ఇస్తాడు. దానిని ఓ పండుగా మలిచి...పుత్రుడి కోసం తపిస్తోన్న అంజనాదేవికి ఇస్తాడు వాయుదేవుడు. అలా గర్భందాల్చిన అంజనాదేవి వైశాఖ బహుళ దశమి రోజు ఆంజనేయుడికి జన్మనిచ్చింది.
భక్తులంతా ఆంజనేయుడిని మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా స్తుతిస్తారు. ఇవన్నీ కలిపినదే రామదూత స్తోత్రం...
Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!
రామదూత స్తోత్రం (Sri Ramadootha Stotram)
రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ |
రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యం
రం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ||
ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ |
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి ||
ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం ఆర్యపూజ్యార్చితాంగమ్ |
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆదిఅంత్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి ||
సం సం సం సాక్షిభూతం వికసితవదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయమ్ |
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వస్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి ||
హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశినయనం రమ్యగంభీరభీమమ్ |
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి ||
ఇతి శ్రీ రామదూత స్తోత్రమ్ ||
Also Read: ఏప్రిల్ 23 నుంచి జూన్ 01 వరకూ ఈ పారాయణం చేయండి - ఫలితం మీరు ఊహించలేరు!
Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!