భారతదేశంలో ఉన్న రామక్షేత్రాలన్నింటిలో రాముడు ద్విభుజుడు. భద్రాచల రాముడు మాత్రం చతుర్భుజుడు. భక్త రామదాసు రాములోరికి ఆలయం కట్టించటమే కాదు ఎన్నో  బంగారు ఆభరణాలు చేయించాడు. భద్రాద్రికి తరలివచ్చే భక్తులు సైతం అనేక రకాల బంగారు ఆభరణాలను రాముడికి కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం రామయ్యకి  54 కేజీలకు పైగా బంగారు ఆభరణాలు, 925 కేజీలకు పైగా వెండి, 34 కోట్లకు పైగా పిక్స్‌డ్ డిపాజిట్లు, 1350 ఎకరాలకు పైగా మాన్యం ఉన్నాయి. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తే ఈ లెక్క మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. 


ముక్కోటి, శ్రీరామనవమి సందర్భాల్లో రామదాసు చేయించిన ఆభరణాలను సీతారామచంద్రస్వామికి ధరింపచేస్తారు.  అవేంటంటే



  • భక్తరామదాసు చేయించిన కలికితురాయి (30గ్రాములు), రవ్వల మొలతాడు (30గ్రాములు)

  • పంచపాత్రలు (576 గ్రాములు), తమలపాకు (62 గ్రాములు), సున్నపు కాయ బంగారు గొలుసు (56 గ్రాములు)

  • శ్రీరామమాడ (58 గ్రాములు),  రెండు వరుసల గొలుసుతో పచ్చల పతకం (100ల గ్రాములు)

  • బిల్లల భుజ బందు, తాయత్తులు, చంద్రవంక లక్కతో సహా (40గ్రాములు)

  • దుద్దులు 2, చెవి పోగులు 2 (40 గ్రాములు), కెంపుల చింతాకు పతకం (50 గ్రాములు)

  •  మూడు మంగళ సూత్రాలు గొలుసు (258 గ్రాములు), జడ నగరు (200ల గ్రాములు)

  •  సీతమ్మవారి కిరీటం (160 గ్రాములు), తులసి గుండ్లహారం (300ల గ్రాములు)

  •  వైరముడి (120 గ్రాములు), అషరఫీల హారం (448 గ్రాములు), డైమండ్ నక్లెస్ పతకంతో (45 గ్రాములు)

  • గజ్జల వడ్డానం (150 గ్రాములు),  బిల్లల మొలతాడు, తాయత్తులు (100 గ్రాములు)


ఈ ఆభరణాలన్ని ఇప్పటికీ  రామాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఇవేకాకుండా భక్తులు సమర్పించిన ఎన్నో బంగారు ఆభరణాలు స్వామివారు ధరిస్తున్నారు. అందుకే తాను కారాగారం పాలైనప్పుడు ...ఇక్ష్వాకు కుల తిలక  ఇకనైనా పలకవా...ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్రా అన్నాడు రామదాసు. 


రూ.34 కోట్లకు పైగా పిక్స్‌డ్ డిపాజిట్లు
 బంగారం, వెండి ఆభరణాలే కాకుండా రూ.34 కోట్ల 28లక్షల 66వేల 467 లు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో నగదు ఉంది. ఇవి వివిధ బ్యాంకుల్లో నిల్వ చేశారు. వీటి నుంచి వచ్చే వడ్డీ ద్వారా నిత్యన్నదానం, ఉద్యోగులకు వేతనాలు అందజేస్తున్నారు. ఎంప్లాయీస్ పింఛన్ ఫండ్, అన్నదానం, శాశ్వత పూజలు, భూములు, రిజర్వ్యూఫండ్, కాటేజీ నిర్మాణం, వాగ్గేయ కారోత్సవాలు, ఫ్లవర్ డేకరేషన్, రామదాసు ప్రాజెక్టు, జనరల్ ఫండ్ ఇలా 196 ఎఫ్‌డీఆర్‌లు ఉన్నాయి.


శ్రీరామదాసు సినిమాలో ఇక్ష్వాకు కుల తిలక పాటలో తాను చేయించిన ఆభరణాల లెక్కలు కొన్ని చెబుతాడు రామదాసు...