Sri Govindaraja Swamy temple Tirupati:  తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన జూన్ 04 బుధవారం ఉదయం అనంతతేజోమూర్తి గోవిందరాజస్వామి సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.  

ఉదయం ఏడు గంటల నుంచి  తొమ్మిది గంటలవరకూ సింహ వాహన సేవ కన్నులపండువగా జరిగింది

సింహ వాహనం ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా స్వామివారు ముందుకు కదిలారు

మంగళవాయిద్యాలు, భక్తజన కోలాటాలు, అడుగడుగునా కర్పూర నీరాజనలు అద్దారు భక్తులు

అడవిరి రారాజు సింహం..గాంభీర్యానికి చిహ్నం సింహం, యోగశాస్త్రంలో సింహాన్ని వాహనశక్తికి,  శీఘ్రగమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భక్తులు కూడా ఆ బలానికి సరిపడా భక్తి భావం అలవర్చుకుంటే స్వామివారి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందని ఈ వాహన సేవ వెనుకున్న ఆంతర్యం. 

అనంత తేజోమూర్తి అయిన గోవిందుడు రాక్షసుల మనసులో సింహంలా గోచరిస్తాడని గోచరిస్తాడని స్తోత్రవాఙ్మయం చెబుతోంది. అందుకే  వాహనసేవల్లో భాగంగా సింహవాహనాన్ని అధిరోహిస్తారు స్వామివారు

 ఉదయం తొమ్మిది గంటవరకూ సింహవాహన సేవ జరగగా... ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటలవరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా  పాలు, పెరుగు, తేనె, చందనం సహా పలురకాల పండ్ల రసాలతో అభిషేకం  నిర్వహించారు. 

జూన్ 04 బుధవారం సాయంత్రం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకూ ఊంజల్ సేవ జరనగుంది. రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అలంకార ప్రియుడైన శ్రీనివాసుడు ఒక్కో రోజో ఒక్కో వస్త్రాభరణ అలంకారంలో వెలిగిపోతుంటాడు. మనసుకి ఆహ్లాదాన్నిచ్చే ముత్యపు పందిరిపై భక్తులను చల్లగా ఆశీర్వదిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడికి ప్రతీక ముత్యం. సముద్రం మనకు ప్రసాదించిన మేలివస్తువుల్లో ముత్యం ఒకటి. చల్లని ముత్యాల కింద సేదతీరుతున్న స్వామివారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా మారుతుందని, అన్ని తాపత్రయాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నృసింహ అవతారం ఒకటి. అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు సింహ వాహనం ప్రతీక అని చెబుతారు పండితులు.  పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం సింహం. ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే సోమరితనం నశించి పట్టుదలతో అడుగు ముందుకు వేస్తారని విశ్వాసం.

వినా వేంకటేశం న నాథో న నాథఃసదా వేంకటేశం స్మరామి స్మరామిహరే వేంకటేశ ప్రసీద ప్రసీదప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ 

అహం దూరతస్తే పదాంభోజ యుగ్మప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమిసకృత్సేవయా నిత్య సేవాఫలం త్వంప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ

ఓం నమో వేంకటేశాయ

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పాకిస్థాన్‌ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!