Kamal Haasan Get Huge Loss Due To Thug Life Not Release In Karnataka: కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్‌పై వెనక్కు తగ్గని కమల్ హాసన్.. 'థగ్ లైఫ్' మూవీని కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. ఈ సినిమాలో ఆయన హీరో మాత్రమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించారు.
ఆయనకు ఎంత లాస్ అంటే?
కర్ణాటకలో మూవీ రిలీజ్ చేయకపోవడం వల్ల నిర్మాతగా ఆయనకు భారీ లాస్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓ రిపోర్ట్ ప్రకారం దాదాపు రూ.14 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ నష్టం వస్తుందని అంచనా. మరోవైపు.. ఒక్క 'సారీ' చెప్తే సమస్య పరిష్కారమైపోతుందని కోర్టు చెప్పినా.. కమల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఏకంగా మూవీనే కర్ణాటకలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.
కేఎఫ్‌సీసీకి రిక్వెస్ట్
'థగ్ లైఫ్' మూవీని కర్ణాటకలో బ్యాన్ చేయాలని కేఎఫ్‌సీసీ నిర్ణయించగా.. దాన్ని వెనక్కి తీసుకోవాలని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (TFAPA) తెలిపింది. ఈ నెల 5 సినిమా రిలీజ్‌కు సహకరించాలంటూ ఓ లెటర్ రాసింది. ఎన్నో ఏళ్లుగా తమిళ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలు కలిసి పని చేస్తున్నాయని.. సినిమా విడుదలకు సహకరించాలని రిక్వెస్ట్ చేసింది. 'శివరాజ్ కుమార్, ఉపేంద్ర, సుదీప్, దునియా విజయ్ వంటి ఎందరో కన్నడ స్టార్స్ తమిళ సినిమాల్లో నటించారు. కోలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కన్నడ చిత్రాలు రూపొందించారు. 'థగ్ లైఫ్'పై మీరు తీసుకున్న నిర్ణయం రెండు చిత్ర పరిశ్రమలపై ప్రభావం చూపుతుంది.
ఈ సినిమా ఈవెంట్‌లో కమల్ ప్రేమతో మాట్లాడారే తప్ప భాషను తక్కువ చేయాలని కాదు. 'కోకిల', 'పుష్పక విమానం' సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమకు కమల్ ఎంతో సహకారం అందించారు. కన్నడ ఫిల్మ్ మేకర్స్‌ను ఆయన ఎంతో గౌరవిస్తారు. కమల్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఇప్పటికే లెటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా రిలీజ్‌కు సహకరించండి. చిత్రాన్ని వాయిదా వేసినా.. బ్యాన్ చేసినా భవిష్యత్తులో రెండు పరిశ్రమల మధ్య అనుబంధం దెబ్బతింటుంది.' అని పేర్కొంది.
అసలేం జరిగిందంటే?
'థగ్ లైఫ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది' అంటూ కమల్ కామెంట్ చేయగా.. కన్నడిగులతో పాటు అధికార, విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ పట్టుబట్టాయి. అయితే.. తాను అన్నీ భాషలను గౌరవిస్తానని.. ఆ కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ కమల్ సమర్థించుకున్నారు. దీనిపై కేఎఫ్‌సీసీ హైకోర్టును ఆశ్రయించగా.. కమల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కమల్ కర్ణాటక ఫిలిం ఛాంబర్‌కు లెటర్ రాస్తూ వివరణ ఇచ్చారు. పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.