Manchu Vishnu About Kannappa Hard Disk Missing: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' హార్డ్ డిస్క్ మిస్సింగ్ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరోసారి స్పందించారు విష్ణు. పోలీసుల విచారణ కొనసాగుతోందని.. హార్డ్ డిస్క్ ఇంకా తమ చేతికి రాలేదని చెప్పారు. ఇంత గొప్ప సినిమా తీశానంటే అది శివయ్య అనుగ్రహమేనని అన్నారు.
వాళ్లిద్దరూ మనోజ్‌తోనే..
'కన్నప్ప' హార్డ్ డిస్క్ మిస్సింగ్ వెనుక ఉన్న ఇద్దరూ మనోజ్‌తోనే ఉంటున్నట్లు తమకు తెలిసిందని విష్ణు అన్నారు. 'ముంబయిలో ఉన్న 8 కంపెనీలు 'కన్నప్ప' వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నాయి. అది క్లారిటీగా లేకపోవడంతో రెండోసారి అప్‌లోడ్ చేసి పంపింది. ముందు జాగ్రత్త కోసం వాళ్లు ఓ హార్డ్ డిస్క్ కూడా పంపారు. నాన్న గారి ముగ్గురి పిల్లలకు సంబంధించి ఏ పార్సిల్ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరు బట్టి ఎవరిది వాళ్లకు అందిస్తారు. మా కంపెనీ జీఎస్టీ రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్నగారి ఇంటిదే ఉంటుంది.
'కన్నప్ప' పార్శిల్ అక్కడికి వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే ఆవిడకు దాన్ని తీసుకోమని చెప్పారట. ఆవిడ దాన్ని తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత మాకు.. వీళ్లిద్దరూ మనోజ్‌తోనే ఉంటారని తెలిసింది. అక్కడ పని చేస్తారో లేదో కూడా మాకు తెలియదు. హార్డ్ డిస్క్ అక్కడే ఉందని తెలిసింది. మధ్యవర్తితో చెప్పి పంపించినా ఇవ్వమన్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించి వారికి మొత్తం వివరించాం. వాళ్లకు అంతా తెలుసు. విచారించి పూర్తి వివరాలు చెబుతారు.' అని అన్నారు విష్ణు.
పాస్ వర్డ్ ఉంది కానీ..
హార్డ్ డిస్క్‌కు పాస్ వర్డ్ ఉంది కాబట్టి సేఫ్ అనే అనుకుంటున్నట్లు మంచు విష్ణు తెలిపారు. అయితే.. ఏ పాస్ వర్డ్ అయినా 99 శాతం మాత్రమే సేఫ్ ఉంటుందని.. 100 శాతం సేఫ్ కాదని అన్నారు. ఇప్పటివరకూ హార్డ్ డిస్క్ తన చేతికి రాలేదన్నారు విష్ణు.
Also Read: ఒక్క రాత్రిలో జీవితం తల్లకిందులు... ఏడు భాషల్లో ప్రియమణి లీగల్ వెబ్ సిరీస్... ఫస్ట్ లుక్ చూశారా?
స్మాల్ మిస్టేక్.. రూ.15 కోట్లు లాస్
భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కించగా.. ఆ బడ్జెట్ మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుందని మంచు విష్ణు తెలిపారు. ఈ మూవీకి ఎంత ఖర్చు చేశామనేది ఇప్పుడే చెప్పనని చెప్పారు. వీఎఫ్ఎక్స్‌కు ఇంత ఖర్చు అయి ఉండకూడదని.. అయితే, చాలా బడ్జెట్ అయ్యిందని అన్నారు. ఓ చిన్న తప్పు వల్ల రూ.15 కోట్లు వృథా అయ్యాయని వెల్లడించారు.
జూన్ 27న రిలీజ్
ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా 'కన్నప్ప' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా.. ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.