Muttaiduva: మొత్తం 5 అలంకారాలున్న స్త్రీని ముత్తైదువ అంటారు. ఆ ఐదు అలంకారాలు ఏంటి..వాటిని అనుసరించడం వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో చూద్దాం...



  1. కాళ్ళకి మెట్టెలు,పట్టీలు

  2. చేతులకి గాజులు

  3. మెడలో మంగళసూత్రం

  4. నుదుటిపై కుంకుమ

  5. తలలో పూలు


కాళ్ళకు పట్టీలు మెట్టెలు 
పెళ్లైన స్త్రీ కాళ్లు బోడిగా ఉండకూడదని మెట్టెలు, పట్టీలు తప్పనిసరిగా ఉండాలని చెబుతారు. దీనివెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే...కాళ్ళలో ఉండే సయాటికా నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి కింది వైపుకి టిబియా అని పిలుస్తారు. ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత  బ్రాంచెస్ గా విడిపోతుంది. ఒక శాఖ వేళ్ళ చివరి వరకు వెళ్లి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్లి అక్కడ ఆగుతుంది. అంటే వేళ్ళ చివరలో ఇంకా మడమల చివర్లో టిబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి. ఈనాడి నేరుగా  గర్భాశయ, మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంది. అంటే స్త్రీలు ధరించే పట్టీలు, మెట్టెలు  ఇవన్నీ టిబియా నాడిని ఒత్తిడి చేయడం ద్వారా గర్భాశయ నాడులను ప్రేరేపిస్తాయి. గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. పైగా మూత్రాశయ సమస్యలు కూడా రావు.


Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!


నుదుట కుంకుమ
అప్పట్లో కుంకుమ రాయితో నూరుకుని మరీ పెట్టుకునేవారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞాచక్రంపై ఒత్తిడి కలుగచేయడం ద్వారా మనస్సును అదుపుచేయడం, ప్రశాంతంగా ఉండడం జరిగేది.


మంగళసూత్రం
మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందట. వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుంచి గుండెపై పడే నీటివల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయంటారు. క్యాన్సర్ కి బంగారం ట్రీట్మెంట్ గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. 


Also Read: చదువు, సంపద కోసం ఈ పద్యం చదవండి పిల్లలకు నేర్పించండి, మీరు దుర్గమ్మ ఉపాసన చేస్తున్నట్టే!


గాజులు
ముత్తైదువ వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అయి ఉండాలి. అంతేకానీ ప్లాస్టిక్ గాజుల కానేకాదు. చేతి మణికట్టు దగ్గర రేడియల్ నెర్వ్ అనే నరం నేరుగా గుండె నరాలతో  సంబంధాన్ని కలిగిఉంటుంది. వైద్యులు కూడా ఈ నాడి స్పందనే గమనిస్తారు. ఈ నరం దగ్గర గాజులుండడం వల్ల శరీరంలో రక్త పోటుని అదుపులో ఉంచుతుంది. అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు. పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు. వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువకావడంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ. కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెబుతారు.  లోహంతో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తాయి. 


తలలో పూలు
పూలు ప్రేమకు, అదృష్టానికి, సంతోషానికి, శ్రేయస్సుకు చిహ్నాలు. స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె, ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని, వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా రాగుతోందని విశ్విసించేవారు. వీటి నుంచి వచ్చే సువాసనల వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో నిండుతుంది. 


ఈ ఐదు అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కుపుడక, చెవిపోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు. ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్నిచ్చేవే..ఇదేం చాదస్తం కాదు. వీటిని ఎంతవరకూ విశ్వసించాలి, అనుసరించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.