ఇల్లు, ఆలయాలు, బడులు ఇలా ఏం నిర్మించినా వాస్తుకు అంత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య ఎక్కువే. ప్రవేశ ద్వారం, మెట్లు , రూమ్స్ సహా ఏవైపు ఏది నిర్మించాలి, ఏమూలన ఏది ఉండాలనేది ముందుగా నిర్ణయించుకుని దాన్ని అనుసరిస్తూ నిర్మాణం పూర్తిచేస్తారు. అయితే వాస్తు అనేది కేవలం ఇల్లు కట్టించుకునే యజమానికి మాత్రమే కాదు... నిర్మించే తాపీమేస్త్రి , కూలీలకు కూడా వర్తిస్తుందట. కూలీల కన్నా తాపీమేస్త్రి తప్పనిసరిగా పాటించాల్సిన వాస్తు నియమాలు కొన్ని ఉంటాయంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఎందుకంటే వీరు జాగ్రత్తగా వ్యహరిస్తేనే నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవడమే కాదు, యజమాని ఆశించిన స్థాయిలో నిర్మాణం పూర్తవుతుంది. 


Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి


తాపీ మేస్త్రిలు పాటించాల్సిన వాస్తు నియమాలు



  • గృహ నిర్మాణం చేపట్టే సమయంలో కొన్ని కీలక గుర్తులతో పాటు..దిశలను ఏర్పాటు చేసుకోవాలి, నైరుతి దిశ 90 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి

  • తాపీ మేస్త్రి నిర్మాణానికి దిగేముందు మూలమట్టాన్ని ముందుగా నైరుతి దిశలో ఉంచాలి. ఆ తర్వాతే ఇతర దిక్కుల్లో దిశలను మార్క్‌ చేసుకోవాలి. ఈ మార్కులు చేసుకునేటప్పుడు ఇతర మూలల కన్నా ఈశాన్యం కొద్దిగా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

  • ఇంటి పునాదులు తీసేటప్పుడు ముందుగా ఈశాన్యం మూల నుంచి ప్రారంభించాలి.  కట్టడం మాత్ర నైరుతి దిశ నుంచి మొదలెట్టాలి.

  • హద్దులను బట్టి ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి.

  • పశ్చిమ-నైరుతి దిశలో కొంత ఎత్తైన గోడ నిర్మించి, ఆ తర్వాత ఇంటి నిర్మాణం చేపట్టాలి.

  • ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని నైరుతి, పశ్చిమ, దక్షిణ భాగాల్లో మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో మాత్రం ఉంచకూడదు.

  • గోడల నిర్మాణంలో ఏ రోజుకారోజు.. దక్షిణ-పశ్చిమ గోడలు.. తూర్పు, ఉత్తర గోడల కంటే కొంచెం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి.

  • స్లాబ్ వేసేటప్పుడు మంచి ముహూర్తం నిర్ణయించాకే వేయాలి, వీటితో పాటూ మరికొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 


Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి


రాగి చెంబులో నీటిని నింపి అందులో పుసుపు, కుంకుమ, పచ్చ కర్పూరం, ఎర్రటి లేదా పచ్చటి పువ్వు వేసి... బియ్యం పిండితో ముగ్గువేసి  ఈశాన్యంవైపు పెడితే కొంత వరకూ దుష్ప్రభావాలు తొలగి పోతాయంటారు. 


వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.