India CoronaVirus Cases: దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులుల 15 వేలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న ఒక్కరోజు భారత్‌లో 15,102 (15 వేల 102) మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డైలీ పాజిటివిటీ రేటు 1.28 శాతానికి పెరిగింది. రికవరీ రేటు ఏకంగా 98 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,64,522 మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) పొందుతున్నారు.
మంగళవారం ఒక్కరోజులో 31,377 (31 వేల 377) మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,21,89,887(4 కోట్ల 21 లక్షల 89 వేల 887)కు చేరింది. అదే సమయంలో కొవిడ్ తో పోరాడుతూ మరో 278 మంది చనిపోయారు. కిందటి రోజుతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు సైతం పెరిగాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,12,622 (5 లక్షల 12 వేల 622)కు చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
176 కోట్ల డోసులు..
గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి మంగళవారం ఉదయం వరకు దేశంలో 1,76,19,39,020 (176 కోట్ల 19 లక్షల 39 వేల 020) డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు. కేసుల తగ్గుతున్నందున ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఫిబ్రవరి 25న సమావేశం కానుంది. దేశ రాజధానిలో COVID-19 ఆంక్షలలో మరింత సడలింపు ఇవ్వాలా వద్దా అనే దానిపై చర్చిస్తారు. అమెరికాలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ఒమిక్రాన్ వేరియంట్ పై నిశితంగా గమనిస్తున్నారు. త్వరలోనే కరోనా వ్యాప్తి తగ్గాలంటే కోవిడ్ ఆంక్షలు కఠినతరం చేయాలని అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.
Also Read: Chicken: మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు, చికెన్ తింటే ప్రమాదమా, బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందా?
Also read: కరోనాలాంటి మహమ్మారులు మళ్లీ రాకుండా ఉండాలంటే చెట్లు పెంచాల్సిందే, చెబుతున్న కొత్త అధ్యయనం