కర్ణాటక శివమొగ్గలో బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటివరకు ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. వారిని మహ్మద్ ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, అసిఫుల్లా ఖాన్, రేహాన్ షరీఫ్, నిహాన్, అబ్దుల్ అఫ్నాన్గా గుర్తించారు. 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిందితులందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీజీపీ తెలిపారు. శివమొగ్గలో ఇప్పటికే ఉన్న 144 సెక్షన్‌ను మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
అల్లరి మూకలు
శివమొగ్గలోని ఆదివారం రాత్రి కారులో వచ్చిన పలువురు దుండగులు బజరంగ్‌దళ్ కార్యకర్త హర్షను కత్తితో పొడిచి హత్యచేశారు. సోమవారం నిర్వహించిన హర్ష అంతిమయాత్రలో దాదాపు 5 వేలమంది పాల్గొన్నారు. ఈ అంతిమయాత్రలో అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి.
ఈ ఘటనలో హింస చెలరేగి ముగ్గురికి గాయాలయ్యాయి. శివమొగ్గ సహా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఇలాంటి ఘటనలు వ్యాప్తి చెందకుండా జిల్లా ఎస్పీ సహా డిప్యూటీ కమిషనర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అదనపు డీజీపీ తెలిపారు.
సీఎం సీరియస్
ఈ ఘటనపై సీఎం బసవరాజ్ బొమ్మై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. శాంతిభద్రతల కాపాడే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అధికారులకు సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఘటనకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని సీఎం ఆదేశించారు.
అయితే ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
Also Read: India Pakistan News: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్రేజీ కోరిక- నరేంద్ర మోదీతో టీవీ డిబేట్ కావాలట!
Also Read: Russia Ukraine Conflict: ఉక్రెయిన్‌లో హైటెన్షన్- విద్యార్థులారా వచ్చేయండి, విమానాలు పంపిస్తున్నాం!