తమిళంలో ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ Bigg Boss Ultimate టెలికాస్ట్ అవుతోంది. ఈ షోకి కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. డేట్ల సమస్య కారణంగా ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ అల్టిమేట్ హోస్ట్ గా వ్యవహరించలేకపోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై బిగ్ బాస్ యాజమాన్యంతో చర్చించానని.. వారు సానుకూలంగా స్పందించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కమల్.
దీంతో కమల్ హాసన్ ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ యంగ్ హీరో శింబుని హోస్ట్ గా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఒకట్రెండు రోజుల్లో రానుంది. రీసెంట్ గానే 'మానాడు' సినిమాతో హిట్ అందుకున్నారు శింబు.
ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శింబు మూడు, నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. అన్నీ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. మరి బిగ్ బాస్ ఓటీటీ కోసం డేట్స్ ఎలా కేటాయిస్తారో చూడాలి. బిగ్ బాస్ అల్టిమేట్ 24 గంటల పాటు హాట్‌స్టార్‌లో ప్రసారమావుతూనే ఉంది. తెలుగులో 24 గంటల ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్‌స్టాప్' ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మొదలు కానుంది.