Spirituality: భారతీయ సంస్కృతిలో ఎక్కడ చూసినా దైవారాధనకు ప్రాముఖ్యత ఎక్కువ. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆలయంలో అడుగుపెట్టగానే మొదట కనిపించేది గంట. స్వామి సన్నిధిలో అడుగుపెట్టగానే అప్రయత్నంగా గంట మోగిస్తారు. ముఖ్యంగా గుడిలో హారతి, కైంకర్యాలు జరిగే సమయంలో గంట కొడతారు. అసలు దేవాలయంలో గంట ఎందుకు కొడతారో తెలుసా...ఆలయంలో కొట్టే గంటకు ఒక అర్థం, పరమార్థం ఉన్నాయి.
Also Read: నవంబరు 29 సుబ్రహ్మణ్య షష్టి - వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఇలా చేయండి
ఇంట్లోకానీ, గుళ్లొకానీ పూజ మొదలు పెట్టే ముందు గంట మోగిస్తారు
ఆగమార్థంతు దేవానాం
గమనార్థంతు రాక్షసాం
కురుఘంటారావం తత్ర
దేవతాహ్వానలాంఛనం...
అని మంత్రం చెబుతారు...దేవతలను ఆహ్వానిస్తూ...రాక్షసగణాలను తరిమికొట్టేందుకు పూజ ప్రారంభం ముందు గంట మోగిస్తున్నామని అర్థం
- దేవుని ముందు గంట కొట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న దుష్ట శక్తులను,వ్యతిరేఖ కిరణాలను దూరం చేస్తుంది
- గంట ఓం శబ్ధానికి లేదా సృష్టి శబ్ధానికి చిహ్నంగా పరిగణిస్తారు..అందుకే గంట కొడతారు
- గంట మోగిస్తే అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. గంట శబ్దం ఎక్కడైతే క్రమం తప్పకుండా వస్తుందో అక్కడి వాతావరణం ఎప్పుడూ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంటుంది.
- స్కంద పురాణం ప్రకారం గుడిలో గంట మోగించడం వల్ల మనిషికి వంద జన్మల పాపాలు నశిస్తాయని విశ్వసిస్తారు
- గంట శబ్దం కంపనాలు వాతావరణంలో వ్యాపించిన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తాయి
- లయబద్ధమైన గంట శబ్దం మనస్సు నుంచి ఉద్విగ్నతను తొలగించి శాంతిని ఇస్తుంది. నిరంతరం గంటను మోగించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి
కాలచక్రానికి ప్రతీకగా గంటను పరిగణిస్తారు. ఇళ్ళల్లో కానీ, దేవాలయాల్లో కానీ హారతి సమయంలో గంటను మోగిస్తే మనసుకి ప్రశాంతం గా ఉండి ఆధ్యాత్మికత వైపు మళ్ళిస్తుంది. గంట ఇంకో ప్రత్యేకత ఏమిటంటే గంట సకల దేవతా స్వరూపం గా భావించి ముందు గా గంటను కొడతారు.
Also Read: మార్గశిర మాసం ఈ ఆలయంలో చాలా ప్రత్యేకం, నేరుగా మూలవిరాట్టుకే పూజలు చేసుకోవచ్చు
గంటలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రత్యేకత
- గంట నాలుక భాగంలో సరస్వతి దేవి
- గంట ముఖ భాగంలో బ్రహ్మదేవుడు
- గంట పొట్ట భాగంలో రుద్రుడు
- గంట కొన భాగంలో వాసుకి
- గంట పిడి భాగంలో గరుడ, చక్ర , హనుమా, నందీశ్వరుడు ఉంటారు...
- హారతి సమయంలో అందరి దేవుళ్ళను ఆహ్వానిస్తూ గంటను మోగిస్తారు. అందుకే హారతి సమయంలో కళ్ళు మూసుకోవద్దని పురోహితులు చెబుతుంటారు
కంచు గంట మోగించినప్పుడు దానిలో నుంచి ఓం అనే శబ్దం వినిపిస్తుంది. ఓంకార నాదం వినడం వల్ల మనిషిలో ఉన్న చింతలు,సమస్యలు తొలిగి పోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి