Turkey Earthquake: టర్కీలో భూకంపం సంభవించింది. పశ్చిమ టర్కీలో డ్యూజ్ పట్టణానికి సమీపంలో 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో 22 మంది గాయపడ్డారు.


ఇదీ జరిగింది


టర్కీలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌కు తూర్పున దాదాపు 210 కి.మీ దూరంలో డ్యూజ్ పట్టణం ఉంది. అయితే భూకంపం కారణంగా ప్రాణనష్టం గురించి ఎటువంటి అప్‌డేట్ లేదని టర్కీ మంత్రి సులేమాన్ సోయ్లు తెలిపారు.


ఈ ప్రకంపనలు ఇస్తాంబుల్, దేశ రాజధాని అంకారాలో సంభవించాయని స్థానిక మీడియా తెలిపింది. భూకంపం లోతు 2 కిమీ నుంచి 10 కిమీ వరకు ఉండచ్చని అధికారులు అంచనా వేశారు.


వాస్తవానికి ఈ ప్రకంపనలు వచ్చిన 20 నిమిషాల తర్వాత 4.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు రావడంతో కొంతమంది భవనాల బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. దీంతో కనీసం 22 మంది గాయపడ్డారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు. భూకంప దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.










ఒకప్పుడు


1999లో డ్యూజ్‌లో 7.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం కారణంగా దాదాపు 845 మంది మరణించారు. దీని తర్వాత పశ్చిమాన 100 కి.మీ దూరంలో ఉన్న ఇజ్మిత్ నగరంలో మరింత పెద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 17,000 మందికి పైగా మరణించారు. ఈ ప్రాంతంలోని భవనాలు దెబ్బతిన్నాయి.1999లో సంభవించిన ఈ భూకంపాల తర్వాత డ్యూజ్ పట్టణంలో 80 శాతం భవనాలు పునర్నిర్మించారు. 


268 మంది బలి


ఇండోనేసియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు సుమారు 268 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 151 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. 1,083 మంది తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. వందల సంఖ్యలో భవనాలు దెబ్బతిన్నాయి. 


Also Read: Satyendar Jain Video: జైలు గదిలో విందు భోజనం, ఆప్ లీడర్ మరో వీడియో వైరల్