వారంలో 7 రోజులు ఒక్కో దేవత లేదా దేవుడికి చిహ్నంగా భావించి పూజలు చేస్తుంటారు. ఆదివారం సూర్య భగవానుడు, సోమవారం పరమేశ్వరుడు, మంగళవారం హనుమాన్, బుధవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా గణేషుడు, గురువారం శ్రీ మహావిష్ణువు లేదా సాయిబాబా, శుక్రవారం శ్రీ మహాలక్ష్మి, శనివారం వెంకటేశ్వరస్వామి ఇలా వారంలో ఒక్కొక్క దేవుడిని పూజిస్తుంటారు. అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే పూజ చేసేటప్పుడు కొని పద్ధతులు పాటిస్తే ఇంట్లో ఆనందం, శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం నెలకొంటాయంటారు పండితులు. అమ్మవారు ఎప్పుడూ శుచి, శుభ్రత ఉన్న ఇంట్లోకే వస్తుంది. అందుకే సాయం కాలం సమయంలోనూ ఇల్లూ, వాకిలీ ఉడ్చి దీపారాధన చేస్తారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రసరింపజేసే మంత్రాలివే...
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
శ్రీ లక్ష్మీ బీజ మంత్రం : శ్రీ హ్రీం శ్రీం కమలే కమలయే ప్రసీద్ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మాయై నమః ।
లక్ష్మీ ప్రార్థన మంత్రం : హలో సర్వగేవనన్ వరదాసి హరే: ప్రియా.
శ్రీ లక్ష్మీ మహామంత్రం : శ్రీలంకా మహాలక్ష్మీ మహాలక్ష్మీ ఏహియేహి సర్వ సౌభాగ్యం దేహంలో స్వాహా ।
శ్రీ హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ర్మ్ ర్మ్ ఆర్ మహాలక్ష్మి నమః..
శ్రీలంకా మహాలక్ష్మీ మహాలక్ష్మీ ఏహియేహి సర్వ సౌభాగ్యం దేహంలో స్వాహా ।
ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మ్యై నమః ।
పద్మనే పద్మ పద్మాక్ష్మీ పద్మ సంభవ్యే తన్మే భజసి పద్మాక్షి యేన సౌఖ్యం లభమ్యామ్.
ఓం హ్రీం త్రీం హట్.
విజయం పొందడానికి
'ఓం శ్రీ హ్రీం క్లీం శ్రీ సిద్ధ లక్ష్మ్యై నమః'
రుణ విముక్తి కోసం
'ఓం హ్రీం శ్రీ క్రీం క్లీం శ్రీ లక్ష్మీ మామ్ గృహే ధన్ పుర్యే, ధన్ పుర్యే,
చింతన్ దూరయే-దుర్యే స్వాహా'
Also Read: పగ నాలుగు రకాలు, ఎవ్వరిపైనా అతివిశ్వాసం వద్దు, ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన కథ ఇదే
మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే ఇలా చేయండి
- మాఘ పూర్ణిమ రోజు లక్ష్మి దేవికి 11 గవ్వలు సమర్పిస్తే...ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడొచ్చు
- మాఘపూర్ణిమ రోజు గోవులకు బొట్టు పెట్టి పూజించి ఆ మరుసటి రోజు గోవుకు ఎర్రటి వస్త్రం కట్టి, డబ్బు దాచే ప్రదేశంలో పెడితే కొన్నాళ్లకు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
- మాఘ పూర్ణిమ రోజు ఉదయం లేదా సాయంత్రం అమ్మవారికి పాయసం సమర్పించి లక్ష్మీ మంత్రాన్ని జపించాలి
- ప్రతి శుక్రవారం మర్రి చెట్టుకు నీళ్ళు పోసి లక్ష్మీదేవికి నమస్కరించే కష్టాలు తొలగిపోతాయంటారు
- తులసి మొక్కకు నిత్యం పూజ చేస్తుంటారు కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
ఇలా చేస్తే లక్ష్మీదేవి కరుణ ఉంటుందని పండితులు చెబుతారు. ఇలా చేయనంత మాత్రాన ఏదో నష్టపోతారన్నది కాదు. వీటిని ఎంత వరకూ విశ్వశించాలన్నది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.