సాధారణంగా ఆలయాల్లో లడ్డూ, పులిహోర, చక్కెర పొంగలి, బూందీ లడ్డు లాంటి ఆహార పదార్థాలను ప్రసాదంగా అందజేస్తారు. కానీ కర్ణాటక ఉత్తర ప్రాంతంలోని రెండు మూడు ఆలయాల్లో, మఠాల్లో గంజాయిని ప్రసాదంగా అందిస్తారు.  అది అక్కడి సంప్రగాయం, చట్టబద్ధం కూడా. నిషేధిత మత్తు పదార్థం గంజాయిని భక్తులకు ప్రసాదంలా పంపిణీ చేస్తారన్న విషయం అస్సలు ఊహకు అందని విషయం. కానీ కొన్నేళ్లుగా ఈ ఆలయాల్లో గంజాయిని ప్రసాదంగా స్వీకరించే ఆనవాయితీ ఉంది..దాన్నే కొనసాగిస్తున్నామంటారు అక్కడి వారు. 


Also Read: పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే దాంపత్య సమస్యలు తప్పవట
కర్ణాటక ఉత్తర ప్రాంతంలో యాద్గిర్ జిల్లా తింథినిలో వెలిసిన మౌనీశ్వర ఆలయంలో భక్తులకు చిన్న, చిన్న గంజాయి పాకెట్లను ప్రసాదంలా పంపిణీ చేస్తుంటారు. ఆలయ పాలక మండలి అధికారికంగా గంజాయిని అందిస్తోంది. ఇక్కడ  పరశురాముడిని మౌనీశ్వరుడిగా, మానప్పగా ఆరాధిస్తూ గంజాయిని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. తమ పెద్దలను అనుసరిస్త తాము కూడా ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నాం అంటున్నారు ఆలయనిర్వాహకులు. శరణ, షప్త, అరుడ, అవధూత సామాజిక వర్గానికి చెందిన భక్తులు గంజాయిని సేవించడాన్ని పవిత్రంగా భావిస్తారని, ధ్యానంలోకి వెళ్లడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తారు. 


Also Read: ఈమె 'మగధీర' మిత్రవింద కాదు శ్రీకృష్ణుడి మిత్రవింద
ఎవ్వరైనా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని, ఆలయ ప్రాంగణంలోనే గంజాయి సేవించడానికి అనుమతి ఉందంటారు అక్కడి స్థానికులు. అయితే ఇక్కడకు వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది సాధువులే ఉంటారని కూడా చెప్పారు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే...గంజాయి ప్రసాదం ఆలయ ప్రాంగణంలోనే తినాలి..బయటకు వెళ్లి తినకూడదు. ఈ ఆలయం గురించి తెలుసుకున్న వారంతా ఇక్కడ గంజాయి నిషేధం-అక్కడ ప్రసాదం అంటున్నారు.


వేదాల పరంగా
పురాతన గ్రంథాలు తరచుగా భా రాంగ్ అని పిలిచే సోమరాసాను తినే దేవుళ్ళ గురించి చెబుతుంటాయి.  అయితే  సోమ-భాంగ్ ఈ రెండూ ఒకటేనా, భిన్నమైన పానీయాలా అన్నది స్పష్టంగా తెలియదు. శివుడు ఎప్పుడూ ధ్యానంలో ఉండడం వల్ల.. పూర్తి ఆనందానికి, ఏకాగ్రత కోసం భంగ్ తీసుకుంటాడని విశ్వసిస్తారు. అమృతం కోసం పాలస‌ముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన గరళాన్ని శివుడు తాగుతాడు. విష‌ం తాగిన శివుడిని శాంతింప‌జేసేందుకు దేవ‌త‌లు ఆయ‌న‌కు భంగు ఇచ్చార‌ని చెబుతారు. అప్ప‌టి నుంచి శివుడికి భంగు ఇష్ట‌మైన పానీయం అయిందంటారు. నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్న ప‌శుప‌తినాథ్ ఆల‌యంలోనూ గంజాయి సేవిస్తుంటారు. పూర్తి ఆనంద స్థితిలో ఉండేందుకు, లోతైన ధ్యానంలో మునిగితేలేందుకు శివుడు భంగ్ సేవిస్తాడని...అందుకే చాలామంది సాధువులు, సన్యాసులు కూడా భంగ్ తీసుకుంటారని చెబుతారు.