జ్ఞాలు, యాగాలు హిందు సంప్రదాయాల్లో చాలా ముఖ్యమైన క్రతువులు. అనేక శుభసందర్బాలలో వీటిని నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే హవనాగ్నిని జ్వలిస్తారు. గృహప్రవేశాలు, పెళ్లిల్లు, ఉపనయనాల సమయంలో అగ్ని హోత్రాలు, హవనాలు నిర్వహించడం పరిపాటి. ఆ సమయంలో వాడిన ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రమైంది. ఎంతో పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. హవనం తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివిటితో నిండిపోతుంది. అక్కడి గాలిలో కూడా ఒకరకమైన సుగంధం ఆవరించి పవిత్రంగా అనిపిస్తుంది. హవనం జరిగిన ప్రాంతం ఎంతో వైబ్రెంట్ గా ఉంటుంది. మరి హవనానంతరం మిగిలిన హవన భస్మం సంగతేమిటి? దాన్ని ఏం చెయ్యాలి? మాములుగా అందరూ దాన్ని నదులు, సముద్రాల వంటి ప్రవహించే నీటిలో వదలుతుంటారు. అలా వదలడం వల్ల అంత పవిత్రమైన హవన భస్మం వృథా అయిపోతుందని పండితులు అంటున్నారు. హవన భస్మాన్ని నదుల్లో పడేయకుండా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు.


యజ్ఞాలు, హోమాల సమయంలో హవనాలు నిర్వహిస్తారు. హవన్ తర్వాత మిగిలిన బూడిద లేదా విభూదిని పనికి రానిదిగా భావిస్తారు. కానీ అది పనికి రానిది కాదు. దాని వల్ల చాలా గే ప్రయోజనాలు  ఉన్నాయని పండితులు అంటున్నారు. అవి తెలుసుకుని హవన భస్మాన్ని జాగ్రత్త పరుచుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆ ప్రయోజనాలు తెలుసుకుంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు.


సనాతన సంప్రదాయ క్రతువుల్లో హవనం కూడా ఒకటి. చాలా శుభకార్యాలలో హవనం చేస్తారు. హవనం జరపడం వల్ల నెగెటివిటి తొలగి పోతుందని నమ్మకం. ఇల్లు శుద్ధి అవుతుందని కూడా ప్రతీతి. హవనం జరిగిన ఇల్లు అన్ని రకాలుగా శుభ్రపడుతుంది. ఈ హవన కుండంలో అన్ని రకాల ముఖ్యమైన పూజా సామాగ్రిని ఉపయోగిస్తారు. ఈ తంతు పూర్తయిన తర్వాత మిగిలిన విభూతిని ప్రవహించే నీటిలో వదిలేస్తారు. హవన అగ్ని మాత్రమే కాదు హవన భస్మం వల్ల కూడా ఎన్నో లాభాలున్నాయని శాస్త్రం చెబుతోందని పండితులు  చెబుతున్నారు. అందుకే దీన్ని జాగ్రత్త పరుచుకోవాలని సూచిస్తున్నారు.


హవన భస్మంతో ఉపయోగాలు



  • హవనం చెయ్యడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అంతేకాదు హవన్ చేసే అగ్ని వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

  • హవన్ తర్వాత మిగిలిన బూడిదను ఇంటి పరిసరాలు, వ్యాపార స్థలాల్లో చల్లితే దిష్టి తొలగిపోతుంది.

  • దిష్టి తగిలినట్టు భావిస్తున్న వ్యక్తి తలపై నుంచి కింద వరకు ఏడు సార్లు హవన బూడిదను తిప్పి తీసేసి దాన్ని మొక్క మొదట్లో ఉంచితే దిష్టి తొలగిపోతుంది.

  • పీడకలలతో భాధపడుతూ నిద్ర పట్టక, భయపడే వారికి ప్రతిరోజు హవన భస్మాన్ని తిలకంగా అలంకరిస్తే పీడకలలు రావడం, భయం తొలగిపోతాయి.

  • హవనానికి ఉపయోగించిన కట్టెలు, భస్మాన్ని ఎర్రని వస్త్రంలో కట్టి దాన్ని డబ్బు దాచుకునే బీరువా లేదా సేఫ్ లో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందని నమ్మకం.


Also Read: మార్గశిర గురువారం లక్ష్మీపూజ ప్రత్యేకం, అష్ట లక్ష్మీ రూపాల వెనుకున్న ఆంతర్యం ఇదే!