విఘ్నాధిపతి అయిన వినాయకుడిని పూజిస్తే తలపెట్టిన పనిలో ఎలాంటి అడ్డంకులు ఉండవంటారు పండితులు. కేవలం విజయం కోసం మాత్రమే కాదు గ్రహదోష నివారణకు కూడా గణపయ్యను పూజించడం కూడా ఓ పరిష్కారం అని చెబుతారు. అయితే అనారోగ్య సమస్యలన్నింటికీ మందు ఒక్కటే ఉండదు కదా..అలాగే మీకున్న గ్రహదోషాన్ని బట్టి గణనాథుడిని ఆరాధించాలి. నవగ్రహాల్లో ఏ గ్రహ దోషం ఉన్నా కింద పేర్కొన్న విధంగా వినాయకుడిని ఆరాధిస్తే ఆ ప్రభావం తగ్గుతుంది. 

  • సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి
  • చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి
  • కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది
  • బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి
  • గురు దోష నివారణకు పసుపు,చందనం లేదా బంగారంతో చేసిన గణపతిని కొలవాలి
  • శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధించాలి
  • శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి
  • రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది
  • కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి
  • ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు
  • పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి
  • పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది
  • సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి
  • స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు 

Also Read:  రాహు మహర్ధశ ప్రభావాన్ని తగ్గించే ఆలయం

గణేశ ద్వాదశనామ స్తోత్రమ్

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః || 1 ||

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః || 2 ||

గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక || 3 ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః || 4 ||

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ || 5 ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ || 6 ||

విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే || 7 ||

|| ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||

Also Read: ఈ అమ్మవారికి కుంకుమ పెట్టి ఏదైనా కోరుకుంటే 41 రోజుల్లో నెరవేరతుందట