Solar Eclipse April 8th 2024:  శ్రీ శోభకృత్ నామసంవత్సరం ఆఖరి రోజైన ఏప్రిల్ 08 సోమవారం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అంటే ఉగాది ముందు రోజు ఈ గ్రహణం ఏర్పడుతోంది. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఫాల్గుణ అమావాస్య ఏప్రిల్ 08 సోమవారం ఉదయం ఏర్పడే ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు కేవలం యూరప్, అమెరికా సహా ఆర్కిటిక్, అట్లాంటిక్, ఫిసిపిక్ సముద్ర తీరంలో, మెక్సికో, అమెరికా టెక్సాస్, న్యూయార్క్, లాస్ ఎంజిల్స్, కొలంబియా , కెనడా, క్యూబా ప్రాంతాల్లో కనిపిస్తుంది. మనదేశంలో గ్రహణం ఎక్కడా కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి...సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనిపించదు..ఆ సమంలో సూర్య గ్రహణం ఏర్పడుతుంది. 


Also Read: మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!


మన దేశంలో గ్రహణం కనిపించకపోయినా కానీ నియమాలు పాటించాలనే చాదస్తం మీకుంటే...ఇవి పాటించండి...



  • సూర్యగ్రహణం , చంద్రగ్రహణం ఏదైనా కానీ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులందరూ స్నానం చేయాలి

  • సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది

  • గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో దేవతామూర్తుల విగ్రహాలను కూడా శుభ్రం చేసి గంగాజలం చల్లాలి

  • గ్రహణం తర్వాత దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దానం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని చెబుతారు.

  • గ్రహణం ముగిసిన తర్వాత ఆహార పదార్థాలలో కలిపిన గరిక లేదా తులసి ఆకులను తీసివేయాలి

  • గ్రహణ సమయంలో గోళ్లు కత్తిరించడం, జుట్టు దువ్వడం, పళ్లను శుభ్రం చేయడం వంటివి అశుభమైనవిగా పరిగణిస్తారు.

  • గ్రహణ సమయంలో నిద్రపోకూడదు

  • గ్రహణ సమయంలో కత్తులు లేదా పదునైన వస్తువులు ఉపయోగించరాదు

  • గ్రహణం సమయంలో పూజలు నిషిధ్దం, ఈ సమయంలో ఆహారం వండకూడదు, తినకూడదు. గ్రహణం సమయంలో,గ్రహణం పూర్తైన వెంటనే ఆరుబయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదు. గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం, మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.


Also Read: మేష రాశి నుంచి మీన రాశి వరకు శ్రీ క్రోధి నామ సంవత్సరం వార్షిక ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 ఏప్రిల్ to 2025 మార్చి!


మహామృత్యుంజయ మంత్రం
"ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం 
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్"


గ్రహణ సమయంలో నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మంచిది
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||


చంద్రుడు 
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||


కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||


బుధుడు 
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||


గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||


శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||


శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||


రాహు 
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||


కేతు 
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||


Also Read: Ugadi Astrological Prediction 2024-2025: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!