ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా 'పుష్ప: ది రూల్'. పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప: ది రైజ్'కు సీక్వెల్ ఇది. బన్నీ బర్త్ డే సందర్భంగా 'పుష్ప 2' టీజర్ విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు టైం కూడా చెప్పేశారు.


సోమవారం ఉదయం 11.07 గంటలకు!
Pushpa 2 Teaser Release Time: సోమవారం ఉదయం 11.07 గంటలకు 'పుష్ప 2' టీజర్ విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. బన్నీ అభిమానులకు, ప్రేక్షకులకు గూస్ బంప్స్ గ్యారంటీ అని పేర్కొంది.


Also Readనాగ చైతన్య, అల్లు అరవింద్ సేఫ్ - కర్మ అనేది వదిలి పెట్టదురా పెట్ల!


క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప 2' మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 'పుష్ప' చిత్రానికి రాకింగ్ మ్యూజిక్ ఇచ్చిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్... 'పుష్ప 2' టీజర్ విషయంలో 'తగ్గేదే లే' అన్నట్టు రీ రికార్డింగ్ చేశారట.






తగ్గేది లే... ఆగస్టు 15న సినిమా విడుదల!
Pushpa 2 Movie Release Date: డిసెంబర్ 17, 2021న 'పుష్ప: ది రైజ్' విడుదల అయ్యింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నుంచి మరో సినిమా థియేటర్లలోకి రాలేదు. అప్పటి నుంచి 'పుష్ప 2' మీద ఆయన కాన్సంట్రేట్ చేశారు. నటుడిగా తనకు నేషనల్ అవార్డుతో పాటు ఎంతో పేరు తీసుకు వచ్చిన క్యారెక్టర్ & సినిమా మీద ఫోకస్ పెట్టారు. సుమారు రెండేళ్లుగా సినిమా కోసం కష్టపడుతున్నారు. ఈ టైంలో అప్డేట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు నిరసనలు, సోషల్ మీడియాలో నేషనల్ ట్రెండ్స్ కూడా చేశారు.


ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కాదని ఆ మధ్య గట్టిగా ప్రచారం జరిగింది. అయితే, అటువంటిది ఏదీ లేదని ఆగస్టు 15న 'పుష్ప 2' థియేటర్లలోకి వస్తుందని సినిమా యూనిట్ స్పష్టం చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. రష్యన్, జపనీస్, చైనీస్ భాషల్లో అనువదించే అవకాశం కూడా ఉంది.


Also Readఆ హిట్ సినిమాలు మిక్సీలో వేస్తే వచ్చిన కిచిడీ 'ఫ్యామిలీ స్టార్' - రామ రామ... ఏంటిది పరశురామా?



'పుష్ప 2'లో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో మరోసారి నేషనల్ క్రష్ రష్మికా మందన్నా సందడి చేయనున్నారు. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఇంకా 'పుష్ప'లో కీలక పాత్రలు చేసిన జగదీశ్, సునీల్, అనసూయ సైతం 'పుష్ప 2'లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ 'పుష్ప: ది రోర్' కూడా తెరకెక్కించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. 


Also Read: 'వేట్టయాన్'తో థియేటర్లలోకి రజనీకాంత్ వచ్చేది అప్పుడే - బిగ్ అప్డేట్ వచ్చేసింది