Sharad Purnima 2023: దీపావళికి ముందు శరద్ పూర్ణిమ లక్ష్మీ దేవిని పూజించడానికి మంచి రోజు. అశ్వ‌యుజ‌ మాసంలో వ‌చ్చే పౌర్ణమినే శరద్ పూర్ణిమ అంటారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 28వ తేదీ శరద్ పూర్ణిమ వ‌చ్చింది. ఈ రోజు రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుంది. ఈ సమయంలో అంటే శరద్ పూర్ణిమ నాడు పగలు, రాత్రి మీరు కొన్ని సాధారణ పనులు చేయడం ద్వారా ఆ సిరుల త‌ల్లిని మీ ఇంటికి ఆహ్వానించవచ్చు. ఫ‌లితంగా ఆమె మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్ప‌ర‌చుకుంటుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, కీర్తి, సంపద మొదలైనవి తెస్తుంది. శరద్ పూర్ణిమ తర్వాత, లక్ష్మీదేవికి ప్రీతికరమైన దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. దీపావళికి ముందు లక్ష్మీ దేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి శరద్ పూర్ణిమ నాడు ఈ పనులు చేయండి.


1. ఇంటిని శుభ్రం చేయండి
శరద్ పూర్ణిమ రోజున మీ ఇంటిని బాగా శుభ్రం చేసుకోండి. ముఖ్యంగా దేవుని గది, ప్రధాన ద్వారం శుభ్రం చేయండి. ఇంటి నుంచి చెత్త బయటకు తీయండి. మెయిన్ డోర్ దగ్గర బూట్లు, చెప్పులు ఉంచవద్దు. లక్ష్మీదేవి స్వచ్ఛమైన ప్రదేశాలలో మాత్రమే నివసిస్తుందని చెబుతారు. మీ ఇల్లు మురికిగా ఉంటే, అక్కడ జేష్ఠాదేవి నివసిస్తుంది. ఆమె పేదరికం, వ్యాధి, అసమ్మతి మొదలైన వాటికి సంకేతం.


Also Read : లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఇంటి ప్ర‌ధాన ద్వారాన్ని ఇలా ఉంచుకోండి!


2. ప్రధాన ద్వారం, దేవుని గది అలంకరణ
శరద్ పూర్ణిమ నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం, దేవుని గదిని అలంకరించాలి. ఈ రోజు ఇంటి మెయిన్ డోర్‌కు మామిడి ఆకుల తోర‌ణాన్ని కట్టి, ద్వారం ముందు ముగ్గు వేయండి. ఇంటి పెరట్లో దీపాలు వెలిగించేలా ఏర్పాటు చేయండి. ఇంట్లో మంచి వెలుతురు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోండి. మత విశ్వాసాల ప్రకారం, లక్ష్మి దేవి శుభ్రమైన, ప్రకాశవంతమైన ప్రదేశాలను ఇష్టపడుతుంది.


3. ప్రధాన ద్వారాన్ని మూసివేయవద్దు
శరద్ పూర్ణిమ రోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచండి. ఇంటి మెయిన్ డోర్ మూసేస్తే, మూసివున్న తలుపును చూసి లక్ష్మీదేవి బయటి నుంచే వెన‌క్కి వెళ్లిపోతుంది. ఈ కారణంగా ఇంటి ప్రధాన తలుపు సంధ్యా సమయంలో తెరిచి ఉంచాలి.


4. దీపం ఇలా వెలిగించండి
లక్ష్మీదేవిని పూజించేందుకు ఏడు ముఖాల దీపాలను వెలిగిస్తారు. మీరు శరద్ పూర్ణిమ రోజు సాయంత్రం లక్ష్మీ దేవిని పూజించి, ఏడు ముఖాల దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయ‌డం ద్వారా లక్ష్మీదేవి త్వరలో ప్రసన్నం అవుతుంద‌ని విశ్వసిస్తారు.


Also Read : ఈ 4 ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ల‌క్ష్మి క‌టాక్షం ఎప్ప‌టికీ సాధ్యం కాదు.!


మీరు శరద్ పూర్ణిమ రోజున పైన పేర్కొన్న పనులు చేస్తే, దీపావళికి ముందే లక్ష్మీదేవి మీ ఇంటికి ప్రవేశిస్తుంది. ఆమె మీ కోసం ధ‌న‌, ధాన్యాలు త‌ర‌లివ‌చ్చే అవకాశాన్ని సృష్టిస్తుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.