Goddess Lakshmi: లక్ష్మీదేవి చంచలమైనది. ఆమను ఆకర్షించడం ఎవరికీ అంత సులభం కాదు. ఆమెను ఆకర్షించడం చాలా కష్టం. లక్ష్మీదేవి కొన్ని స్వభావాలు ఉన్నవారిని చూడడానికి కూడా ఇష్టపడదు. ఆమె వారికి దూరంగా ఉండాలనుకుంటుంది. లక్ష్మీదేవి ఎవరినైనా కరుణిస్తే, ఆమె వారి జీవితాన్ని సంపద, శ్రేయస్సు, ఆనందంతో నింపుతుంది. ఆమె కనుక ఎవరిపైన అయినా ఆగ్రహిస్తే ఇక వారి జీవితంలో సమస్యల సముద్రాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ నాలుగు లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటానికే లక్ష్మీదేవి ఎప్పుడూ ఇష్టపడుతుంది. ఆ నాలుగు లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.
1. సోమరితనం
ఎప్పుడూ బద్ధకంగా ఉండే వ్యక్తి పట్ల లక్ష్మీదేవి తన అనుగ్రహం చూపదు. అలాంటి వ్యక్తులు పేదలుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. వారి ఇళ్లలో ఏదో ఒక రూపంలో దరిద్రం తాండవిస్తుంది. అలాంటి వారి జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి. అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండాలని లక్ష్మీదేవి కోరుకుంటుంది. అందుకే సోమరితనం ఉండకూడదు, రోజువారీ పనులను సకాలంలో పూర్తి చేసే అలవాటు అలవరచుకోవాలి.
Also Read : మీరు కోరుకున్నవన్నీ పొందాలంటే ఈ అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి
2. గొడవలు
ఇళ్లలో ప్రతి చిన్న విషయానికి గొడవపడే వారితో, కటువుగా మాట్లాడేవారిపై లక్ష్మీదేవి కరుణ, కటాక్షం ఉండవు. కటువుగా మాట్లాడే, ప్రవర్తించే అలవాటు మానేయండి. వీలైనంత వరకు ఇంట్లో సామరస్య వాతావరణం నెలకొని ఉండేలా ప్రయత్నించండి.
3.అధర్మపరులు
ఇతరుల సంపదపై చెడు దృష్టి ఉన్న వారిపై, అధర్మ మార్గాల ద్వారా సంపదను పోగుచేసే వారిపై లక్ష్మీ దేవి కోపగించుకుంటుంది. ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించే వారికే లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. మోసం చేసి సంపాదించిన డబ్బు తాత్కాలికమే. ఇలాంటి వారు తమ జీవితాలను పేదరికంలో గడుపుతారు.
4. అపరిశుభ్రత
వ్యక్తిగత శుభ్రత, ఇంటి శుభ్రత పట్ల శ్రద్ధ చూపని వ్యక్తి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎన్నటికీ పొందలేడు. అలాంటి వారి జీవితంలో పేదరికం నెలకొని ఉంటుంది. అలాంటి వారు ఎంత కష్టపడినా ధనవంతులు కాలేరు. అలాంటి వ్యక్తులు అనారోగ్యం, అప్పులు, సంతోషమే ఎరుగని జీవితంతో బాధపడుతూ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటారు.
Also Read : శుక్రవారం పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకండి
ఈ పైన పేర్కొన్న 4 గుణాలు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేడు. వారు జీవితంలో పేదరికం, ఆనందం, డబ్బు సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.