Kuppam YSRCP :   టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంమైన కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీకి సందుకో వర్గం తయారైంది. ఒకరితో ఒకరికి పడదు. చివరికి ఈ వర్గాలు ఎలా తయారయ్యాయంటే..నియోజకవర్గ బాధ్యత తీసుకున్న  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద దాడి చేయడానికి కూడా వెనుకాడలేదు. 


వైసీపీ ద్వితీయ శ్రేణి నేతల అరాచకాలు


చంద్రబాబును ఓడించే లక్ష్యంతో మంత్రి పెద్దిరెర్డిడ రామచంద్రారెడ్డి నేర స్వభావం ఉన్న  వారిని పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కబ్జాలు, దందాలకు పాల్పడేవారిని పార్టీ నేతలుగా ప్రోత్సహిస్తూండటంతో వారు పోటాపోటీగా నేరాలు చేస్తున్నారు. ఇటీవల ఓ ఆస్పత్రిలో వైసీపీలోని రెండు వర్గాలు.. కొట్టుకున్న వైనం చూసి రాష్ట్రం మొత్తానికి గుగుర్పొడిచింది. వాళ్లంతా పెద్ది అనుచరులుగా రోజూ కుప్పం మీద పడి ప్రజల్ని భయపెడుతూనే ఉంటారు. 


సొంత నేతల ఆస్తులన కబ్జాలు చేస్తున్న వైసీపీ నేతలు


ఇక ఇతర డివిజన్ స్థాయి నేతలు అయితే.. సొంత పార్టీ కార్యకర్తలనూ వదలడం లేదు. ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపించినా కబ్జా చేయడమే ధ్దేయడంగా పెట్టుకున్నారు. ఇటీవల కబ్జాల వ్యవహారంలో మంత్రి పెద్దిరెడ్డికి కూడ ాషాక్ తగిలింది.  శాంతిపురం మండలం పరిధిలోని మోరసనపల్లె వద్ద వారపు సంత జరిగే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపి మండల కన్వీనర్‌ బుల్లెట్ దండపాణి కబ్జా చేశారు. అదే భూమిపై కన్నేసిన ఇతర వర్గం నియోజకవర్గం ఇంచార్జ్, ఎమ్మెల్సీ భరత్ దృష్టికి తీసుకెళ్లారు. కానీ కబ్జా చేసిన వ్యక్తికి అండగా ఉన్నారు. దీంతో  మరో వర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుడిపల్లె మండలంలో ఓ ఆలయం కుంభాభిషేకంకు వచ్చినప్పుడు అడ్డం పడ్డారు. పరిస్థితి విషమించడంతో వైసీపీ నేతలపైనే పోలీసులు దౌర్జనం చేసి పంపేశారు. సర్పంచ్ భార్యపై దురుసుగా ప్రవర్తించడంతో కుప్పం అంతా గగ్గోలు రేగింది. 


వర్గాల పోరాటంలో వరుసగా రాజీనామాలు                                                 


ఇలాంటి గొడవలు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. ఒక్కో గ్రామం వైసీపీలో మూడు , నాలుగు వర్గాలుంటున్నాయి. వీరిలో అత్యధికులు కేసులు ఉన్న వాళ్లు నేరసత్వం ఉన్న వారు కావడంతో.. ప్రజలు కూడా వారిని చూసి భయపడుతున్నారు.  ఇటీవల మూకుమ్మడి రాజీనామాలు పెరిగిపోయాయి. ఎమ్మెల్సీ భరత్ ను ముందు పెట్టారు కానీ.. పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే వ్యవహారాలు జరుగుతూంటాయి.  కనీసం ఓ చిన్న స్థాయి పార్టీ పదవిని కూడా భరత్ నిర్ణయించలేరు. నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ దందా మొత్తం పెద్దిరెడ్డి అనుచరుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.  వైసీపీ నేతల అరాచకత్వంతో ప్రజలు విసిగిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.