శనివారానికి అధిపతి శనీశ్వరుడు. సంఖ్యలలో 'ఎనిమిది' శనికి ప్రీతికరమైన సంఖ్య. ప్రత్యక్ష దైవం అయిన సూర్యుడు, ఛాయాదేవికి పుట్టిన సంతానం శని. అందుకే ఛాయాపుత్రుడు అనికూడా అంటారు. మనుషుల జాతక చక్రాలపైన తన ప్రభావం ఎలా చూపబోతున్నాడో అని చెప్పేందుకే శని..సూర్య గ్రహణం సమయంలో జన్మించాడని చెబుతారు. 


శనీశ్వరునికి ఇష్టమైనవి నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రంగా-బద్ధకంగా ఉండే చోటు. బతికి ఉన్నంతకాలం చేసిన తప్పులకు మరణానంతరం శిక్షలు వేస్తాడు శనిదేవుడి అన్నయ్య యమధర్మరాజు. కానీ తమ్ముడు శని మాత్రం జీవుడు బతికిఉండగానే తన ప్రతాపాన్ని చూపిస్తాడు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపేలా చేస్తాడు. నమ్మక ద్రోహం,వెన్నుపోటు,హింస,పాపం, అన్యాయ మార్గాలను అనుసరించేవారికి వారి కర్మ ఫలిత ఆధారంగా శనిదేవుడు వారిని ఎక్కువ ఇబ్బంది పెడతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. 


Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే


గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటాయి. శని ప్రభావం పడితే అన్న యముడుని దాదాపు పరిచయం చేసి తీసుకొస్తాడని( అంటే చావు అంచుల వరకూ తీసుకెళ్లి తీసుకొస్తాడని) అంటారు. అందుకే శని పట్టకుండా ఎవ్వరూ ఆపలేరు కానీ ఆ ప్రభావం తగ్గించేందుకు, శనని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు  చదివితే మంచిదంటారు పండితులు 


ఓం శం శనయేనమ
ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః 
కోణస్ధః పింగళ బభ్రు
కృష్ణో రౌద్రంతకో యమ: 
సౌరి శనైశ్చరో మంద: 
పిప్పలాదేవ సంస్తుత: 


నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం 
ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం 


ఓం  సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష: 
శివప్రియ: మందచార: ప్రసనాత్మ పీడాం హరతుమే శని


శని గాయత్రీ మంత్రం: 
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. 
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ 


శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి


''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.


శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే


ఈ శ్లోకాలను కుదిరితే నిత్యం లేదంటే ప్రతి శనివారం జపించడం వల్ల శనిదోషం తగ్గుతుందని చెబుతారు. ముఖ్యంగా ఆంజనేయుడిని, శివుడిని పూజించినా శని ప్రభావం తక్కువ ఉంటుందంటారు. 


నోట్: వీటిని ఎంతవరకూ అనుసరించవచ్చు అనేది మీ భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది


Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే