2022 ఫిబ్రవరి 19 శనివారం రాశిఫలాలు


మేషం
ఈరోజు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీ పని పద్ధతిలో మార్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సోదరులతో మీ సంబంధాలు బావుంటాయి. పెద్ద బాధ్యతను నెరవేర్చడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు. పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు.  కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి


వృషభం
వ్యాపారులకు ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. విద్యార్థులకు చాలా మంచి రోజు. అనవసరంగా జోక్ చేసే అలవాటు అదుపు చేసుకోండి. ఏ పనిని, బాధ్యతను వాయిదా వేయవద్దు. మీరు కొత్త ప్రాజెక్ట్ గురించి కుటుంబ సభ్యులతో చర్చించవచ్చు. ఈరోజు మీరు కొత్త విషయం నేర్చుకుంటారు. 


మిథునం
ఈరోజు కుటుంబ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండొచ్చు. మీ వ్యక్తిగత విషయాలను అందరికి చెప్పి విమర్శల పాలవకండి.ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. పనికిరాని విషయాల్లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేయకండి. 


Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే
కర్కాటకం
మీరు జీవిత భాగస్వామితో సంతోష క్షణాలు గడుపుతారు. ఉద్యోగులకు మంచి రోజు, మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో భారీ లాభం ఉంటుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
 
సింహం
ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక సంబంధాల్లో ఖర్చుల కారణంగా వాదనలు పెరుగుతాయి. స్నేహితులతో సంతోష సమయం గడపవచ్చు. జోక్స్ ని తప్పుగా అర్థం చేసుకోకండి. 
 
కన్య
ఏదైనా ముఖ్యమైన పని ఈరోజు ఆగిపోవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. మూస పద్ధతులను వదిలివేయండి.


తుల
మీ మాటతీరు ఎదుటివారిని నొప్పించేలా ఉంటుంది. ప్రేమ సంబంధాల విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఎవరినైతే దగ్గరి వారిగా భావిస్తారో వారికారణంగా కొంత ఇబ్బంది పడతారు. నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మీ ఆలోచనలను ఇతరులతో పంచుకోవద్దు.
 
వృశ్చికం
వ్యాపారంలో చాలా లాభాలుంటాయి. మీ శత్రువులు మీకన్నా చురుకుగా ఉంటారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రిలేషన్ షిప్ లో ఇంటెన్సిటీ ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ సీనియర్ సహోద్యోగుల సహాయం అందుతుంది.


Also Read: ఈ రాశుల వారికి అదృష్టం కలిసొస్తుంది, ఈ వారంలో ఏ రాశిఫలితం ఎలా ఉందంటే
ధనుస్సు 
ఈ రోజు మీ పని సమయానికి పూర్తిచేస్తారు.  కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారంలో లాభం పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశాలుంటాయి.  బంగారం, వెండి వ్యాపారం చేసే వారికి కలిసొచ్చే సమయం.  ధనలాభం కలుగుతుంది. విలువైన వస్తువులను  కాపాడుకుంటారు. దొంగతనం జరిగే అవకాశం ఉంది. 


మకరం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. నిలిచిపోయిన మొత్తం తిరిగి వస్తుంది. విద్యార్థులకు చదువులో కొంత ఇబ్బంది ఉంటుంది. అధికారులతో టెన్షన్‌ తొలగిపోతుంది.
 
కుంభం
ఈ రోజు మీకు మంచి రోజు. పూర్వీకుల విషయాలు మీకు అనుకూలంగా రావొచ్చు. సంపద పెరుగుతుంది. మీ అభిప్రాయాలను అంగీకరించమని ఇతరులను ఒత్తిడి చేయవద్దు. మీరు మీ లక్ష్యం నుంచి దూరంగా ఉంటారు. పనికిరాని పనుల్లో చిక్కుకోకండి, ఆఫీసులో సమస్య పరిష్కారమవుతుంది.


మీనం
మీరు స్నేహితులతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఇంటికి బంధువులు రావొచ్చు.  ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. వైవాహిక సంబంధాలు బావుంటాయి.