Shani Effect on Zodiac Signs


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని న్యాయ దేవత. ఆయా రాశుల వారి కర్మానుసారం ఫలితాలను అందజేస్తాడు. శని సంచారం 12 రాశులపైనా ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశులకు మంచి చేస్తే మరికొన్ని రాశులకు చెడు చేస్తుంది. ఇంకొన్ని రాశులవారిని ప్రాణపాయం వరకూ తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తాడు. ప్రస్తుతం తిరోగమనంలో ఉన్న శని మకర రాశిలో సంచరిస్తున్నాడు. అక్టోబరు 20 వరకూ ఇదే రాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఈ ప్రభావంతో మూడు రాశులవారికి మూడు నెలల పాటూ మహారాజయోగం పడుతుంది. ఆ రాశులేంటంటే..


మేషం
మహాపురుష రాజయోగం మేష రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్, నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రాజకీయాల్లో ఉన్నవారికి కలిసొస్తుంది.  వ్యాపారం పెరుగుతుంది. ఏ పని తలపెట్టనా పూర్తవుతుంది. 



మిథునం
మకరంలో శని సంచారం మిథున రాశివారికి కలిసొస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ధనలాభం పొందుతారు.ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులు బాగా సెటిలవుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి కలిసొస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పురోగతి కారణంగా మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి. 


కన్య  
తిరోగమనంలో ఉన్న శని కన్యారాశివారికి మంచి రోజులు తీసుకొచ్చింది.గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు,కష్టాలు తగ్గుతాయి. ఈ రాజయోగ ప్రభావంతో ఆకస్మిక ధనలాభం పొందుతారు. తలపెట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనులు జోరందుకుంటాయి. ఇంటర్యూలకు హాజరయ్యేవారు, పోటీ పరీక్షలు రాసేవారికి ఈ మూడు నెలలు శుభసమయం. 


Also Read: వరలక్ష్మీ వ్రతం, నాగపంచమి, రాఖీ సహా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకూ వచ్చే పండుగలు, వాటి విశిష్టతలు


శని గాయత్రీ మంత్రం: 
ఓం ఖగథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్. 
ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ 


శని శాంతి మంత్రం
క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి