హనుమంతుడు అకుంఠిత భక్తితో దేవుడిగా మారిన భక్తుడు. అతడి తిరుగులేని రామభక్తి అతడిని దైవంగా మార్చింది. హనుమంతుడి ఆరాధన వల్ల జీవితంలో సాధించలేమని అనుకున్న కార్యాలను కూడా సాధించగలిగే ఆత్మవిశ్వాసం వస్తుంది. హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసా పఠించడం దగ్గరి దారి. హనుమాన్ చాలీసా పఠించేందుకు కొన్ని చిన్న చిన్న నియమాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా త్వరగా లక్ష్యాన్ని సాధించవచ్చు.


హనుమాన్ చాలీసా పఠించే వారి జీవితంలో కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కానీ హనుమాన్ చాలీసా పఠించే సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అలా నియమానుసారం పఠించినపుడు తప్పకుండా ఫలితం ఉంటుంది.


హనుమాన్ చాలీసాలో మొత్తం నలభై శ్లోకాలు ఉంటాయి. ఈ పద్య సంపుటిని తులసీ దాస్ రచించారు. వీటిని దోహాలు అని కూడా అంటారు. శివుడి 11వ రుద్రావతారంగా హనుమంతుడిని భావిస్తారు. హనుమాన్ చాలీసా చదివినా, విన్న అత్యంత భక్తి భావానికి లోనవుతారు. హనుమాన్ చాలీసా పఠించే ఎవరికైనా అనారోగ్యం నుంచి విముక్తి దొరుకుతుంది. శత్రు బాధ నశిస్తుంది. హనుమంతుడి ఆరాధన ప్రాణ శక్తి పెరుగుతుంది.



  • హనుమాన్ చాలీసా పఠించడానికి మంగళ వారం చాలా అనువైన రోజు. మంగళ వారం నాడు ప్రదోష వేళ నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి.

  • ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఆతర్వాత సీతా రాములను ఆరాధించాలి. అప్పుడు రామ భక్త హనుమాన్ కు నమస్కారం చేసుకుని హనుమాన్ చాలీసా పఠిస్తాననే ప్రతిజ్ఞ చేసుకోవాలి.

  • తర్వాత హనుమంతుడికి పువ్వులు సమర్పించి, ధూపం వెలిగించి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం మొదలు పెట్టాలి.

  • హనుమాన్ చాలీసా కుశాసనం మీద కూర్చుని చదవాలి. ఒక్కసారి పూర్తిగా చదవాలి లేదా చదవగలిగితే 11సార్లు కూడా చదువుకోవచ్చు. హనుమాన్ చాలీసా చదవాలని అనుకున్నపుడు మధ్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం తినకూడదు.

  • హనుమాన్ చాలీసా చదవడం పూర్తయిన తర్వాత బూందిలడ్డు లేదా పండ్లు హనుమంతుడికి సమర్పించాలి. తర్వాత ప్రసాదాన్ని మీరు తీసుకోవడంతో పాటు ఇతరులకు కూడా పంచాలి.


హనుమాన్ చాలీసా చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు



  • హనుమాన్ చాలిసా క్రమం తప్పకుండా నలభై రోజుల పాటు పఠిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది.

  • భయాల నుంచి విముక్తి లభిస్తుంది.

  • కార్యసాధనలో ఏర్పడిన అడ్డంకులు తొలగి పోతాయి. అభివృద్ధి మార్గం సుగమం అవుతుంది.

  • మంగళ వారం సంకట్మోచన హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందకు అనువైన రోజు. హనుమంతుడు మాత్రమే కలియుగంలో సైతం సజీవంగా ఉన్న దైవంగా భక్తుల నమ్మకం.

  • హనుమంతుడి దయ వల్లే తులసీదాస్ కు రాముడి సాక్షాత్కారం కలిగిందని చెబుతారు.

  • రామకథ జరిగే చోట హనుమంతుడు తప్పక ఏదో ఒక రూపంలో ఉంటాడని నమ్మకం.

  • క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా చదవడం వల్ల దుష్టశక్తుల నుచి విముక్తి దొరికి ధైర్యవంతుడవుతాడు.

  • హనుమాన్ చాలీసా పఠనం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది.

  • పిల్లలు హనుమాన్ చాలీసా పఠిస్తే మేధావులుగా, సంస్కారవంతులుగా ఎదుగుతారు.


Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి