తెలుగు బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది సుమ మాత్రమే. తన మాటతీరు, అదిరిపోయే పంచులతో అందరినీ  ఇట్టే ఆకట్టుకుటుంది. అందుకే, ఆమె యాంకర్ గా చేసే షోలన్నీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేస్తుంటాయి. అలాంటి షోలలో ఒకటి ‘సుమ అడ్డా’. ప్రతి శనివారం బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుంది ఈ షో. ఈ వారం ఎపిసోడ్ లో ‘రామ బాణం’  మూవీ టీమ్ సందడి చేసింది. హీరో గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయతీ, గెటప్ శ్రీను, శ్రీవాస్ పాల్గొని నవ్వుల పువ్వులు పూయించారు. చివరల్లో మాత్రం షాకింగ్ ఘటన జరగింది. ఇంతకీ తాజాగా విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..  


యాంకర్ సుమ గొంతు పట్టుకున్న గోపీచంద్


గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' వంటి విజయాల తర్వాత మరోసారి హీరో, దర్శకుడు కలిసి చేస్తున్న చిత్రమిది. ఇందులో డింపుల్ హయతీ హీరోయిన్ గా చేస్తోంది.  జగపతి బాబు, ఖుష్బూ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.   పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ  బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మే 5న ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా సినిమా యూనిట్ ఈ షోకు వచ్చింది. హీరో గోపీచంద్‌, దర్శకుడు శ్రీవాస్, హీరోయిన్‌ డింపుల్ హయతీ, గెటప్ శ్రీను ‘సుమ అడ్డ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 29వ ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చివర్లో యాంకర్ సుమ గొంతును గోపీచంద్‌ పట్టుకోవడం సంచనలం కలిగిస్తోంది. అంతకు ముందు హీరో గోపీచంద్ వేసిన పంచులకు షో అంతా నవ్వులు విరబూశాయి.  



టీఆర్పీ ట్రిక్స్ అంటున్న నెటిజన్లు


ఇంతకీ ఆయన ఆమె గొంతు ఎందుకు పట్టుకున్నారు అనే విషయంపై నెట్లింట్లో తెగ చర్చనడుస్తోంది. కొంత మంది గోపీ చంద్ అలా చేయడం ఏంటిని ప్రశ్నిస్తుంటే, మరికొంత మంది జస్ట్ టీఆర్పీ ట్రిక్ అని తేల్చిపారేస్తున్నారు. ఇలాంటి ట్విస్టులు గతంలో మస్తు చూశాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ట్రిక్స్ తో పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అంటున్నారు. ఇంతకీ అసలు షోలో ఏం జరిగిందో తెలియాలంటూ ఏప్రిల్ 29 వరకు ఆగాల్సిందే. అయితే, ‘జయం’ సినిమాలో సదా గొంతు పట్టుకుని పైకి లేపుతారు. ఆ సీన్ రిక్రియేట్ చేసి ఉండొచ్చు. ఈ షోలో ఇంతకు ముందు ‘దసరా’ టీమ్, అంతకు ముందు ‘వాల్తేరు వీరయ్య’ టీమ్ సైతం సందడి చేశాయి. మెగాస్టార్ చిరంజీవి, నేచురల స్టార్ నాని ఈ షోలో పాల్గొని ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.  







Read Also: ఆ కారణంతోనే లెస్బియన్ చిత్రం ‘ఫైర్’కు సంగీతం అందించా: ఏఆర్ రెహమాన్