రంభా వ్రతం అంటే అరటి చెట్టును పూజించడం. అరటి చెట్టును రంభా వృక్షమని అంటారు. అరటిచెట్టును సాక్షాత్తు పార్వతీదేవి పూజించిందని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుడిని పెళ్లిచేసుకునేందుకు పార్వతీదేవి చేసిన చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవుతూ ఉండటంతో ఏం చేయాలో అర్థంకాక కన్నీళ్లు పెట్టుకుంది. అలాంటి పరిస్థితిలో పార్వతీదేవికి భృగు మహర్షి సూచించి, వివరించిన వ్రతమే రంభావ్రతం.


Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం


పురాణకథనం
సావిత్రి, గాయత్రిలలో బ్రహ్మపట్ల సావిత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించేదట. దాంతో బీజంలేని వృక్షంగా భూలోకాన పడిఉండమని ఆమెను బ్రహ్మ శపించాడు. అలా సావిత్రి అరటిచెట్టు రూపంలో ఉంటూ బ్రహ్మ గురించి తప్పస్సు చేసి ఆయన మనసు గెలుచుకుంది. బ్రహ్మ సంతృప్తి చెంది ఆమెను సత్యలోకానికి తీసుకువెళుతూ, ఆమె అంశాన్ని మాత్రం అరటిచెట్టులోనే ఉంచాడు. అందుకే అరటి చెట్టుకు కోరిన కోర్కెలు తీర్చే శక్తి లభించిందని..'లోపాముద్ర' కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే అగస్త్యుడిని భర్తగా పొందిందని పార్వతీ దేవితో చెప్పాడు భ్రుగుమహర్షి. 


Also Read:గుడిలో అడుగుపెట్టే ముందు ద్వారానికి( గడపకి) ఎందుకు నమస్కారం చేస్తారు


భృగు మహర్షి చెప్పినట్టే...జ్యేష్ట శుద్ధ తదియ రోజున తెల్లవారు జామున తలస్నానం చేసి, అరటిచెట్టున్న ప్రదేశంలో అలికి ముగ్గులు పెట్టి చెట్టుకింద మండపాన్ని ఏర్పాటు చేసి పూజించింది పార్వతీ దేవి. నెలరోజుల పాటూ వ్రతాన్ని ఆచరించిన పార్వతీ దేవి.. నిత్యం అరటి చెట్టుని పూజించి నైవేద్యం సమర్పించేది. మొదటి రోజు మాత్రం జాగరణ చేసి ... నెలరోజుల పాటు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించింది. ఆ తర్వాత పార్వతీ దేవి పరమశివుడిని భర్తగా పొందగలిగింది. కుటుంబంలో కలతలు ఉన్నవారు, వివాహం కానివారు ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారని భక్తుల విశ్వాసం.


అర్థ నారీశ్వర స్తోత్రమ్


చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ


కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజః పుంజ విచర్చితాయ
కృత స్మరాయై వికృత స్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ


ఝణత్క్వణత్కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ


విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విషమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ


మందార మాలా కవితాలకాయై
కపాల మాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయై
నమశ్శివాయై చ నమశ్శివాయ


అంభోధర శ్యామల కుంతలాయై
తటిత్రభా తామ్ర జటధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ
 
ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయ


ప్రదీప్త రత్నోజ్జ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ


ఏతత్పఠే దష్టక నిష్టదం యో
భక్త్వా స మాన్యోభువి దీర్ఘ జీవీ
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం
భూయాత్సదా చాన్య సమస్త సిద్ధిః


ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత అర్థనారీశ్వర స్తోత్రమ్ 


Also Read: యమలోకంలో ఎంట్రీ ఉండకూడదంటే ఈ దానాలు చేయమన్న గరుడపురాణం