ఓం అంటే శబ్దం. అదే మూల శక్తి. ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్ధానికీ శక్తి ఉంటుంది. అందుకే అ,ఉ,మ తో కలసిన ప్రతి బీజాక్షరానికీ శక్తి ఉంటుంది. బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను మనం ఉచ్ఛరించినప్పుడు శరీరంలో శక్తి జనిస్తుంది. ఇలా పుట్టిన శక్తితో సకల సంకల్పాలు నెరవేరుతాయి. అంత శక్తివంతమైనది ఓంకారం. కానీ ’ఓం’కారాన్ని తీసుకొచ్చి ఇంట్లో పూజ చేయలేరు కదా..అందుకు ప్రత్యామ్నాయ మార్గమే శ్రీరామ పట్టాభిషేకం ఫొటో. ఈ ఫొటో ఉన్నఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదని చెబుతారు పండితులు.


Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే


రాముడు అకారానికి ప్రతినిధి
యో వేదాదౌ స్వరఃప్రోక్తః! వేదాంతేచ ప్రతిష్ఠితః!
అకారం విష్ణువు అయితే ఉకార మకారములు లక్ష్మణస్వామి, సీతాదేవి
’మ్’ అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమంతుడు.



  • అకార ఉకార మకార నాద స్వరూపమైన హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రుడి  పట్టాభిషేక మూర్తి.

  • రాముడికి పూజ వాళ్లు చేయొచ్చా-వీళ్లు చేయొచ్చా అని ఉండదు. ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేక మూర్తికి పూజ చేయడం అంత గొప్పది.

  • రాముడిని వీర రాఘవ, విజయ రాఘవ అంటారు. ఎల్లవేళలా కోదండం చేతిలో పట్టుకుని ఉంటాడు. అపజయం అన్నది రాముడికి లేదు. అలాంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత్వం, శత్రుభయం ఉండదని విశ్వాసం

  • రామచంద్రమూర్తియే వేంకటేశ్వరుడు. ’కౌసల్యాసుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్! అంటూ రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా నిద్రలేపాడు.

  • నిరుద్యోగులు, శత్రుభయం ఉన్నవారు, ఇంట్లో ఆందోళనలు ఉన్నవారు, డిప్రెషన్ కి గురైనవారు, తమకంటూ ప్రత్యేక గుర్తింపు లభించాలనుకునేవారు శ్రీరామ పట్టాభిషేకం  నిత్యం ఉదయాన్నే  21 సార్లు లేదా 11 సార్లు  పఠిస్తే శుభం జరుగుతుందని చెబుతారు.


Also Read: సీతారాముల కళ్యాణం జరిగిన అసలు ప్రదేశం ఇదే


శ్రీరామ పట్టాభిషేక సర్గ


నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితోనఘః |
రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ||


ప్రహృష్టముదితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః |
నిరాయమో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః ||


న పుత్రమరణం కించిద్ద్రక్ష్యంతి పురుషాః క్వ చిత్ |
నార్యశ్చావిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||


న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||


న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా |
నగరాణి చ రాష్ట్రాణి ధన ధాన్యయుతాని చ ||


నిత్యం ప్రముదితాస్సర్వే యథా కృతయుగే తథా |
అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః ||


గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||


రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||


దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ |
రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి ||


ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||


ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||