పచ్చని మొక్కలున్న పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయని అనడం ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇంటి లోపల పెంచుకునే మొక్కలు అందం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. తులసి, తామర, ఆర్కిడ్ వంటి మొక్కలు గాలిని శుద్ధి చెయ్యడం మాత్రమే కాదు, వాస్తు నియమాల్లో కూడా ఉంటాయి. కానీ కొన్ని మొక్కలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెంచుకోకూడదు. వాస్తులో ఈ మొక్కల గురించి ప్రత్యేక చర్చ ఉంది. అవేమిటో ఒకసారి చూద్దాం.
కాక్టస్
వాస్తు లేదా ఫెంగ్ ష్యూయి ఎక్స్పర్ట్స్ కాక్టస్ మొక్కలు అందంగా కనిపిస్తాయి. కానీ అవి ఇంటిలోకి బ్యాడ్ లక్ ని ఆహ్వానిస్తాయి. ఈ మొక్కల్లో ఉండే పదునైన ముళ్లు నెగెటివ్ ఎనర్జీని ఎట్రాక్ట్ చేస్తాయని ఒక నమ్మకం. ఇవి పెట్టుకుంటే ఇంటిలోకి దృరదృష్టాన్ని ఆహ్వానించినట్లే. ఇవి ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయట. ఇంట్లో మనశ్శాంతి నశిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కాక్టస్ ఇంట్లో ఉండనే కూడదని కాదు. కానీ, సరైన స్థానంలో దీన్ని ఉంచితే మేలు జరుగుతుంది. టెర్రాస్ మీదో లేక కిటికిలోనో పెడితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఆపుతాయి. ఒకరకంగా అవి ఇంటికి కాపాలాగా ఉండే రక్షణ కవచాలు.
బోన్సాయ్
బోన్సాయ్ మొక్కలు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఇవి ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. వాస్తు నిపుణులు ఇవి ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిదని అంటున్నారు. ఇవి పెరుగుదల నిరోదకానికి గుర్తులు. జీవన గమనంలో ఆటంకాలు ఏర్పరుస్తాయి. ముందుకు సాగడంలో అడ్డంకులకు కారణం కావచ్చు. అయితే వీటిని ఓపెన్ ప్లేసుల్లో పెంచుకోవడం మంచిది.
పత్తి చెట్టు
పత్తి మొక్కలు, సిల్క్ కాటన్ మొక్కలు ఇంట్లో పెట్టుకోవడానికి అంత మంచివి కాదు. ఈ తెల్లని అందమైన మొక్కలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కానీ ఇవి వాస్తుపరంగా అంత మంచివి కాదునే నిపుణులు సలహా ఇస్తారు. వీటిని ఇంటిలోపల పెట్టుకుంటే చాలా అన్ లక్కీ అని అంటున్నారు.
గోరింటాకు చెట్టు
గోరింటాకు చెట్టు దుష్టశక్తులను ఆకర్షిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటి మొక్కల్లో చింత చెట్టు కూడా ఒకటి. దీన్నీ కూడా ఇంట్లో ఫెట్టుకోకూదు. చింత చెట్టు పక్కన ఇంటి నిర్మాణం కూడా కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
చనిపోయిన మొక్కలు
ఎటువంటి మొక్కలైనా సరే వాడి పోయి ఎండిపోయి కనిపించినా అవి ఇంట్లో పెట్టుకోవడం అంత మంచిది కాదు. ఇంట్లో ఉండే మొక్కలు పచ్చగా అందంగా కనిపించవచ్చు. అందుకే ఇంట్లో పెంచుకునే మొక్కలు పచ్చగా తాజాగా ఉండేలా జాగ్రత్త పడాలి. చచ్చిపోయిన లేదా ఎండిపోయిన మొక్కలు చెడుకు సంకేతాలు. కనుక వెంటనే తీసేయ్యాలి.
ఇంట్లో పెట్టుకోకూడని మరికొన్ని మొక్కలు
⦿ ఖర్జుర చెట్టు - ఈ చెట్టు చాలా సులభంగా పెరుగుతుంది. ఇది ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు చుట్టుముడుతాయి.
⦿ వెదురు చెట్టు – వెదురు మొక్క ఇంట్లో పెట్టుకోవడం ఫెంగ్ ష్యూయి ప్రకారం చాలా లక్కీ. కానీ వీటిని మన దేశంలో మరణ సమయాల్లో వాడుతుంటారు కనుక వాస్తు అపశకునంగా భావిస్తారు.
⦿ తుమ్మ చెట్టు – ముళ్లుండే చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయని అంటున్నారు.
అదృష్టం తెచ్చే మొక్కలు
⦿ తులసి,
⦿ మనీ ప్లాంట్
⦿ వేప చెట్టు
⦿ అరటి చెట్టు
⦿ తామర మొక్క
ఇంట్లో మొక్కులు పెంచడానికి ప్లాన్ చేస్తుంటే తప్పకుండా ఎలాంటి మొక్కలు మంచివో తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచిది.
Also Read: విదుర నీతి ప్రకారం ఎలాంటి వ్యక్తులకు నిద్రపట్టదు?
Also Read: ఈ రాశివారు గతంలో చేసిన పొరపాటుకి ఇప్పుడు భయపడతారు, అక్టోబరు 8 రాశిఫలాలు