వాచ్ కు బదులుగా ఆవు పిడకలు!


ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేస్తే ఒక్కోసారి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చెప్పడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంఫుల్. యూపీలో ఓ మహిళ ఫ్లిప్‌కార్ట్ లో వాచ్‌ని ఆర్డర్ చేస్తే..  ఇంటికి  ఆవు పిడకలు డెలివరీ అయ్యాయి. ఊహించని పరిణామంతో  సదరు మహిళ షాక్ అయ్యింది. ఈ ఘటన కౌశాంబిలోని కసెండా గ్రామంలో జరిగింది. ఈ ఊరికి చెందిన  నీలం యాదవ్ అనే మహిళ ఫెస్టివల్ ఆఫర్లలో భాగంగా ఫ్లిప్‌కార్ట్  నుంచి తన సోదరుడు రవీంద్ర కోసం వాచ్ ఆర్డర్ చేసింది.  సెప్టెంబర్ 28న ఈ ఆర్డర్ బుక్ చేసింది. తొమ్మిది రోజుల తర్వాత అంటే అక్టోబర్ 7న ఆర్డర్ వచ్చింది. రూ. 1,304 చెల్లించి, నీలం తన ఆర్డర్ ను తీసుకుంది.


ఆర్డర్ ఓపెన్ చేసి అవాక్కైన నీలా సోదరుడు


ఈ ఆర్డర్ బాక్స్ ను తన సోదరుడు రవీంద్రకు ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. తన సోదరి ఇచ్చిన బహుమతిని చూసి ఎంతో సంతోషపడ్డాడు రవీంద్ర. వెంటనే ఆర్డర్ బాక్స్ ఓపెన్ చేశాడు. అందులో వచ్చిన వస్తువులను చూసి షాక్ అయ్యాడు. గడియారానికి బదులుగా అందులో ఆవు పిడకలు రావడంతో అవాక్కయ్యాడు.  


Also Read: ఒంటిని విల్లులా వంచి ప్రపంచ రికార్డు సాధించిన 14 ఏండ్ల అమ్మాయి!


డబ్బు వాపస్ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్ సంస్థ


ఈ విషయానికి సంబంధించి వెంటనే నీలం యాదవ్  ఫ్లిప్‌కార్ట్ సంస్థకు ఫిర్యాదు చేసింది. కంపెనీ నుంచి వచ్చిన డెలివరీ బాయ్ మళ్లీ వారి దగ్గరికి వెళ్లి ఆవు పిడకలను వెనక్కి తీసుకున్నాడు. నీలా యాదవ్ చెల్లించిన డబ్బును తిరిగి ఇచ్చేశాడు. ఆర్డర్ తీసుకోవడంలో జరిగిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని ఫ్లిప్‌కార్ట్ సంస్థ వెల్లడించింది.   


Also Read: ఈ ATMలో డబ్బులు తీయాలంటే 4,693 మీటర్ల పర్వతం ఎక్కాలి, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏటీఎం!


ల్యాప్‌టాప్‌కు బదులుగా గడి డిటర్జెంట్ డెలివరీ


ఈ ఏడాది ప్రారంభంలో సైతం ఫ్లిప్‌ కార్ట్‌ లో ఇలాంటి ఘటనే జరిగింది. ల్యాప్ టాప్ కోసం ఆర్డర్ చేస్తే గడి డిటర్జెంట్ సబ్బులు డెలివరీ అయ్యాయి.  ఐఐఎం-అహ్మదాబాద్ లో గ్రాడ్యుయేషన్ చదువుతున్న యశస్వి శర్మ.. తన తండ్రికి ల్యాప్‌ టాప్ ఆర్డర్ చేశాడు. 'బిగ్ బిలియన్ డే' సేల్ సందర్భంగా ల్యాప్‌ టాప్‌ కు ఆర్డర్ పెట్టాడు. కానీ, అతడికి ల్యాప్ టాప్ కు బదులుగా గడీ డిటర్జెంట్ సబ్బులు వచ్చాయి. ఆర్డర్ ఓపెన్ చేసి చూసి శర్మ షాక్ అయ్యాడు. లింక్డ్ ఇన్ వేదికగా ఫ్లిప్‌ కార్ట్‌ తీరును  ఎండగట్టాడు.