పరశురామ అంటే పార్షుతో రాముడు.. అది గొడ్డలి. క్రూరత్వం నుంచి భూమిని కాపాడటానికి పరశురాముడి అవతరించాడు. ఆయన శివ భక్తుడు. ఆయన ఆయుధం గొడ్డలి. పరశురాముడు ప్రసేనాజిత్ కుమార్తె రేణుక, బ్రిగు రాజవంశీయులైన జమదగ్ని దంపతులకు ఐదవ కుమారుడిగా జన్మించాడు. లక్ష్మీ అవతారమైన ధనవిని పెళ్లిచేసుకున్నాడు.  హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు చిరంజీవి.  ఆయన ఇప్పటికీ జీవించిఉన్నట్టు విశ్వశిస్తారు.  భీష్ముడు, ద్రోణాచార్యులు, కర్ణుడు...వీరి ముగ్గురి  గురువు పరశురాముడు. ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు... అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు . 


హరి వంశ పురాణం ప్రకారం
కార్తా విర్యార్జునుడు రాజు, మాహిష్మతి నగరాన్ని పరిపాలించేవాడు. ఇతర క్షత్రియులతో కలసి ఎన్నో విధ్వంసక పనులు చేస్తుండేవాడు. వీరి క్రూరత్వం నుంచి కాపాడాలంటూ జీవులంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అప్పుడు పరశురాముడిగా....రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు శ్రీహరి. ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి తీసుకెళ్లిపోతారు.  పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి వెళ్లి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు. క్షత్రియ జాతిపై ఆగ్రహించిన పరుశరాముడు 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను  నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు.ఆ తర్వాత  పరశురాముడు భూమినంతటినీ కశ్యపుడికి దానమిచ్చి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. 


Also Read:  ఇంట్లో కనక వర్షం కురిపించే స్తోత్రం, నిత్యం చదివితే ఆర్థిక సమస్యలే ఉండవు


రామాయణంలో పరశురాముడు
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధన, రాముడి  శాంత వచనాలనూ పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రాముడు ఎక్కుపెట్టిన బాణాన్ని  తన తపోశక్తిని కొట్టమని చెప్పి, మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు పరశురాముడు. అంటే ధనస్సును పరశురాముడు రాముడికి అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అర్థమైందన్నమాట. 


Also Read: అక్షయ తృతీయ రోజు బంగారం కొనకూడదు, ఏం చేయాలంటే


మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్ముడికి అస్త్రవిద్యలు బోధించాడు. ద్రోణుడు, కర్ణుడికి విద్యలు నేర్పింది పరశురాముడే. కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తర్వాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు.


పరశురామ గాయత్రి మంత్రం
ఓం జామదగ్న్యాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో పరశురామః ప్రచోదయాత్ ॥


Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది