ఒకప్పుడు గుమ్మడికాయలను ఆహారంగా అధికంగా ఉపయోగించేవారు. వాటితో చాలా రకాల వంటలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు వాటి వాడకం చాలా తగ్గిపోయింది. పూర్వం గుమ్మడి గింజలను ఎండబెట్టి డబ్బాలో వేసి దాచుకునేవారు. వాటిని అప్పుడప్పుడు పిల్లలు, పెద్దలు తినేవారు. నట్స్ కేటగిరీలోకి వచ్చే వీటిని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచివని వైద్యులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా మగవారు వీటిని తినాల్సిన అవసరం ఉంది. ఆధునిక కాలంలో పురుషుల్లో వీర్యకణాలు తక్కువగా ఉండడం అనే సమస్య ఎక్కుమమందిని వేధిస్తోంది. దీని వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే గుమ్మడిగింజలను రోజుకో గుప్పెడు తింటే వారిటో వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఆ కణాలు సంపూర్ణ ఆరోగ్యంగా కూడా ఉంటాయి. కాబట్టి మగవారు బద్ధకించకుండా రోజూ ఉదయాన బ్రేక్ ఫాస్ట్ అయ్యాక గుమ్మడి గింజలు తినేందుకు ప్రయత్నించాలి. సాయంత్రం తినే చిరుతిళ్లకు బదులు వీటిని తింటే ఇంకా మంచిది. 


ఇంకా ఎన్నో లాభాలు
గుమ్మడి గింజలు తినడం వల్లే కేవలం సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడమే కాదు, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయి.ఇందులో ఉండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ గింజల్లో పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీ రాకుండా అడ్డుకుంటుంది. రక్తనాళాల్లో రక్త సరఫరా ప్రశాంతంగా సాగేలా చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితులు రాకుండా ఉంటాయి. కాబట్టి ఎవరైనా వీటని తినవచ్చు. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ గింజలు చాలా అవసరం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఇవి నియంత్రిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడతాయి. కాబట్టి అధిక బరువు తగ్గాలనుకునేవారు కూడా వీటిని రోజూ తినాలి.


క్యాన్సర్ నిరోధకాలు
రోగనిరోధక వ్యవస్థలో తెల్లరక్త కణాలు చాలా ముఖ్యమైనవి. బయటి నుంచి వచ్చే బ్యాక్టిరియా, వైరస్‌లతో పోరాడే పని వాటిదే. అలాంటి తెల్ల రక్తకణాలకు శక్తినిచ్చేవి, వాటి సంఖ్య పెరిగేలా చేసేవి గుమ్మడి గింజలే. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ వంటి భయంకర రోగాలను రాకుండా అడ్డుకుంటాయి. 


అందానికీ
చర్మసౌందర్యానికీ గుమ్మడి గింజలు చాలా అవసరం. వీటిలో ఉండే నూనె చర్మ సంరక్షణకు మేలు చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి  చర్మాన్ని కాపాడుతుంది. గుమ్మడి గింజల నూనెలో ఒమెగా 3 ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మానికి సంబంధించిన సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి.  అంతేకాదు జుట్టు పెరుగుదలకు కూడా ఇవి మేలు చేస్తాయి. గుమ్మడిగింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. పట్టులా జుట్టు పెరిగేందుకు ఇవి సహకరిస్తుంది. 


Also read: నిద్ర పెంచినా తగ్గించినా సమస్యే, డయాబెటిస్ వచ్చే ఛాన్స్



Also read: ప్రపంచంలో తొలి ఫాస్ట్‌ఫుడ్ సమోసానే, మనదేశానికి ఎలా వచ్చిందంటే