శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 11 సోమవారం పంచాంగం
తేదీ: 11-07 -2022
వారం: సోమవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాడమాసం
తిథి : ద్వాదశి సోమవారం ఉదయం 7.49....రాత్రి తెల్లవారుజామున(తెల్లవారితే మంగళవారం) 5.30 వరకూ త్రయోదశి తదుపరి చతుర్దశి
నక్షత్రం: జ్యేష్ఠ సోమవారం రాత్రి తెల్లవారుజామున (తెల్లవారిత మంగళవారం) 3.44 వరకు తదుపరి మూల
వర్జ్యం : ఉదయం 10.28 నుంచి 11.58 వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.32 నుంచి 1.24 వరకు తిరిగి మధ్యాహ్నం 3.08 నుంచి 4.00 వరకు
అమృతఘడియలు : రాత్రి 7.28 నుంచి 8.58 వరకు
సూర్యోదయం: 05:35
సూర్యాస్తమయం : 06:35
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
Also Read: 'తొలి ఏకాదశి' మర్నాడే 'వాసుదేవ ద్వాదశి', ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే!
చాతుర్మాస్య వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు ప్రారంభించాలని మిగిలిన పురాణాలు చెబుతుంటే వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని చెబుతోంది స్మృతి కౌస్తుభం . ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి సుభద్ర వ్రతం మొదలుపెట్టక పోవటంతో, ద్వాదశి రోజు ఆమెకు కృష్ణుడు(వాసుదేవుడు) గోపద్మ వ్రతాన్ని ఉపదేశించి ఐదేళ్ల వ్రతాన్ని ఒకేసారి పూర్తి చేయించాడని కథనం. అందుకే వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిందని భావిస్తారు. వాసుదేవ ద్వాదశి సందర్భంగా కృష్ణాష్టకం...
శ్రీ కృష్ణాష్టకం ( Krishnashtakam)
వసుదేవసుతం దేవం - కంసచాణూరమర్దనం |
దేవకీపరమానందం - కృష్ణం వందే జగద్గురుమ్ || 1 ||
అతసీపుష్పసంకాశం - హారనూపురశోభితం |
రత్నకంకణకేయూరం - కృష్ణం వందే జగద్గురుమ్ || 2 ||
కుటిలాలకసంయుక్తం - పూర్ణచంద్రనిభాననం |
విలసత్కుండలధరం - కృష్ణం వందే జగద్గురుమ్ || 3 ||
మందారగంధసంయుక్తం - చారుహాసం చతుర్భుజం |
బహీర్పింఛావచూడాంగం - కృష్ణం వందే జగద్గురుమ్ || 4 ||
ఉత్ఫుల్లపద్మపత్రాక్షం - నీలజీమూతసన్నిభం |
యాదవానాం శిరోరత్నం - కృష్ణం వందే జగద్గురుమ్ || 5 ||
రుక్మిణీకేళిసంయుక్తం - పీతాంబరసుశోభితం |
అవాప్తతులసీగంధం - కృష్ణం వందే జగద్గురుమ్ || 6 ||
గోపికానాం కుచద్వంద్వం - కుంకుమాంకితవక్షసం |
శ్రీనికేతనం మహేష్వాసం - కృష్ణం వందే జగద్గురుమ్ || 7 ||
శ్రీవత్సాంకం మహోరస్కం - వనమాలావిరాజితం |
శంఖచక్రధరం దేవం - కృష్ణం వందే జగద్గురుమ్ || 8 ||
కృష్ణాష్టక మిదం పుణ్యం - ప్రాత రుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం - స్మరణేన వినశ్యతి || 9 ||
ఇతి శ్రీ కృష్ణాష్టకం
Also Read: ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుదట
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే